Delhi CM Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ప్రధానిని కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి… ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశానని ఎక్స్ వేదికగా సీఎం అతిశీ తెలిపారు.
Read Also: MD Sajjanar : దసరా పండుగకు ఆర్టీసీ టికెట్ చార్జీలు పెంచలేదు : ఎండీ సజ్జనార్
ఈరోజు ప్రధాని నరేంద్రమోడీని కలిశానని ఎక్స్ వేదికగా సీఎం అతిశీ పేర్కొన్నారు. మన దేశ రాజధానిలో సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ఇటీవల ఢిల్లీ సీఎం అధికార నివాసంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిశీ ఫిఫ్ట్ అయిన నేపథ్యంలో అధికారిక పత్రాలు రాలేదంటూ ఆమె వస్తువులను అధికారులు తీసుకువెళ్లిపోయారు. దీంతో ఈ అంశంపై గవర్నర్ వర్సెస్ ఆప్ మధ్య దుమారం రేగింది. కేంద్రం అండతో గవర్నర్ వీకే సక్సేనా ముఖ్యమంత్రి వస్తువులను తరలించారని సీఎంఓ ఆరోపించింది. అయితే వివాదం మరింత ముదరకముందే సమస్యను పరిష్కరించారు. సీఎంకు అధికారికంగా నివాసాన్ని కేటాయించడంతో ఈ వివాదానికి తెరపడింది.
Read Also: Renu Desai : మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన రేణు దేశాయ్.. ఏ సినిమా కోసమో..