PM in 2025: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే, కేజ్రీవాల్‌తో పాటు ఆయన పార్టీని మట్టికరిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారనేది స్పష్టమైన వాస్తవం. కాబట్టి బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని, వీలైతే ప్రధానమంత్రి పదవికి తమను తాము ముందుంచుకునే ప్రయత్నం చేయడం తక్షణావసరం. ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ఆయన పార్టీ ఒక చోట నిలదొక్కుకుంటే, ఆ పార్టీని కదిలించడం అసాధ్యం అని ఇది ఢిల్లీతో పాటు పంజాబ్‌లో నీరూపితమైంది.
కేజ్రీవాల్ విడుదలైన తర్వాత తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల వయస్సు తర్వాత పదవీ విరమణ నియమాన్ని అనుసరించి సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేస్తారని సంచలన కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. హోం మంత్రి అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని కేజ్రీవాల్ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండు నెలల్లో దేశంలో భారీ మార్పులు జరగవచ్చని తెలిపారు. అయితే కేజ్రీవాల్ ప్రకటనపై బీజేపీ కౌంటర్ ఇస్తూ.. తమ పార్టీలో 75 ఏళ్లు నిండిన తర్వాత రిటైర్మెంట్ నిబంధన లేదని, మోదీ ప్రధానిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ఈ తొలి ప్రసంగం కేజ్రీవాల్‌ను బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కేంద్రంగా నిలిపింది.
ఇదిలా ఉండగా సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా పోటీ చేయనందున, బీజేపీ ఓడిపోతే సంకీర్ణ ప్రభుత్వం అనివార్యం కావడంతోపాటు ప్రధాని పదవికి పోటీ పడే వారు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ఆ దిశలో తనను తాను ప్రొజెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన ప్రధానంగా వ్యతిరేకించిన పార్టీ అయిన కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి ఏ మాత్రం ఇబ్బంది పడలేదు. నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకుడిలా అవసరమైన రాజకీయ కసరత్తులు చేశాడు.
Also Read: AP Poll: సైకిల్‌కి ఓటు గుద్దేసిన జగన్ ?