Kejriwal : ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 06:39 PM IST

 

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో ఈడీ(Ed) తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ()ED Custody) విధింపు అక్రమం(illegal) అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ ను గురువారం నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించింది.

Read Also: Kalki: ప్రభాస్ కల్కిపై అంచనాలు పెంచేసిన స్వప్న దత్.. కామెంట్స్ వైరల్?

అయితే, ఇవాళ కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై ఆదివారం నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని విన్నవించారు. కేజ్రీవాల్ విడుదలకు అర్హమైన వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టం చేశారు.

Read Also: BRS MP Candidates: భువనగిరి, నల్గొండ MP అభ్యర్థులను ప్ర‌క‌టించిన కేసీఆర్‌

ఈడీ అరెస్ట్ చేయకముందు కూడా కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ ను అడ్డుకోవాలని కోరారు. కానీ, కేజ్రీవాల్ అరెస్ట్ కు తాము మినహాయింపునివ్వలేమని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పుడు, కేజ్రీవాల్ మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, ఈసారి చీఫ్ జస్టిస్ బెంచ్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.