Site icon HashtagU Telugu

Atishi Vs BJP : అతిషికి బీజేపీ పరువునష్టం నోటీసులు.. ఎందుకో తెలుసా ?

Atishi Vs Bjp

Atishi Vs Bjp

Atishi Vs BJP : ఢిల్లీలోని ఆప్ సర్కారులో నంబర్ 2‌గా పేరున్న మంత్రి, సీనియర్ నాయకురాలు అతిషి మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ‘‘బీజేపీలో చేరాలనే ఆఫర్ నాకు వచ్చింది. ఒకవేళ చేరకుంటే నెల రోజుల్లోగా నాతో పాటు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, పార్టీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లను ఈడీతో అరెస్టు చేయిస్తామనే వార్నింగ్ కూడా బీజేపీ నుంచి అందింది’’ అని మంగళవారం అతిషి చేసిన కామెంట్స్‌కు బీజేపీ ఘాటుగా స్పందించింది. అతిషి చెబుతున్నవన్నీ అబద్ధాలే అని ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవ స్పష్టం చేశారు. తాము అతిషికి ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని వెల్లడించారు. అతిషి అబద్ధాలు చెప్పి పారిపోతానంటే కుదరదని.. ఆమెకు ఇప్పటికే పరువు నష్టం దావా నోటీసులు పంపామని వీరేంద్ర సచ్‌దేవ తెలిపారు. వాటికి 15 రోజుల్లోగా అతిషి సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అతిషి సమాధానం చెప్పకుంటే.. బీజేపీ తరఫున సివిల్, క్రిమినల్ చర్యలను తీసుకుంటామని ఢిల్లీ బీజేపీ చీఫ్(Atishi Vs BJP)  వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join

అతిషి మరో ట్వీట్.. 

సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మంత్రి అతిషి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ఏదైనా జరిగితే దేవుడు కూడా బీజేపీని క్షమించడని ఆమె పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కు తీవ్రమైన డయాబెటిక్ ఉందన్నారు. అరెస్టు చేసినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు నాలుగున్నర కిలోలు తగ్గిందని చెప్పారు.  కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచి.. ఆయన ఆరోగ్యంతో బీజేపీ చెలగాటమాడుతోందని విమర్శించారు.

Also Read :Allu Arjun : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. బర్త్‌డేకి అవేవి లేవంట..

7న ఆప్ నిరాహార దీక్ష

కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ నేతలు ఏప్రిల్ 7న జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తామని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మంత్రులు, ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వ్యాపారులు కూడా పాల్గొంటాయన్నారు.

Also Read :Arvind Kejriwal : తీహార్ జైలులో కేజ్రీవాల్‌‌కు ఆ ముప్పు.. హైఅలర్ట్‌ !