Delhi Assembly Elections : వచ్చే ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)దూకుడు ప్రదర్శిస్తోంది. ముందుగానే తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి జాబితాను గురువారం విడుదల చేసింది. బీజేపీ మాజీ నేతలు బ్రహ్మ్ సింగ్ తన్వర్, అనిల్ ఝా మరియు BB త్యాగి, కాంగ్రెస్ మాజీ నేతలు చౌదరి జుబేర్ అహ్మద్, వీర్ ధింగన్, ఇటీవల ఆప్‌లో చేరిన సుమేష్ షోకీన్‌లను కూడా చేర్చుకున్నారు.
మొదటి జాబితాలో పేరున్న అభ్యర్థులు:
.ఛతర్‌పూర్: బ్రహ్మ సింగ్ తన్వర్
.కిరారీ: అనిల్ ఝా
.విశ్వాస్ నగర్: దీపక్ సింగ్లా
.రోహతాస్ నగర్: సరితా సింగ్
.లక్ష్మీ నగర్: బిబి త్యాగి
.బదర్‌పూర్: రామ్ సింగ్ నేతాజీ
.శీలంపూర్: చౌదరి జుబేర్ అహ్మద్
.సీమాపురి: వీర్ దింగన్
.ఘోండా: గౌరవ్ శర్మ
.కరావాల్ నగర్: మనోజ్ త్యాగి
.మతియాలా: సుమేశ్ త్యాగి మతియాలా
కాగా, ఈ రోజు కేజ్రీవాల్ నివాసంలో పార్టీ పీఏసీ సమావేశం జరిగింది. అందులో పార్టీ నుంచి పోటీ చేసే 11 మంది అభ్యర్ధులను ఖరారు చేసారు. ఆప్ నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సమయంలో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. ముందుగానే అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు.
ఇకపోతే..చివరి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 2020లో జరిగాయి. ఇక్కడ AAP 70 సీట్లలో 62 స్థానాలను కైవసం చేసుకుని నిర్ణయాత్మక విజయాన్ని సాధించింది. బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే చేయగలిగింది. కాంగ్రెస్ తన ఖాతా కూడా తెరవలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, కేజ్రీవాల్ పదవీకాలం పెద్ద సవాళ్లను ఎదుర్కొంది. మార్చి 2024లో, రద్దు చేయబడిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అతన్ని అరెస్టు చేసింది. తరువాత జూన్ 2024లో సిబిఐ చేత అరెస్టు చేయబడ్డాడు. అరెస్టు చేసిన మొదటి సిట్టింగ్ సిఎంగా నిలిచాడు. కేజ్రీవాల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించడంతో సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Beauty Tips: ఏంటి అల్లంతో ముఖంపై ముడతల సమస్యలు తగ్గించుకోవచ్చా.. అదెలా అంటే?