GMR Vs Central Govt: ఢిల్లీ ఎయిర్‌పోర్టును నిర్వహించే జీఎంఆర్ సంస్థ కేంద్ర ప్రభుత్వంపై దావా వేసింది. ఘజియాబాద్‌లో ఉన్న హిండాన్ విమానాశ్రయంలోకి వాణిజ్య విమానాలను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో జీఎంఆర్ పిటిషన్ వేసింది. ఈవిధంగా చేయడం వల్ల తాము నిర్వహించే ఢిల్లీ ఎయిర్ పోర్టు ఆర్థికంగా నష్టపోతుందని వాదించింది. ఈమేరకు ఆరోపణలతో మార్చి 10న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఒక ఎయిర్ పోర్టుకు, మరో ఎయిర్ పోర్టుకు మధ్య కనీసం 150 కి.మీ దూరం ఉండాలనే రూల్‌ను కేంద్ర విమానయాన శాఖ ఉల్లంఘించిందని జీఎంఆర్ ఆరోపించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 30 కి.మీ దూరంలోనే హిండాన్ వైమానిక స్థావరం(GMR Vs Central Govt) ఉందని గుర్తు చేసింది. అక్కడ ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులకు ఇచ్చిన అనుమతిని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోర్టును జీఎంఆర్ కోరింది. ఈ పిటిషన్‌పై భారత విమానయాన శాఖ స్పందించాల్సి ఉంది.
Also Read :Deputy CM Bhatti : గ్రీన్ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడి.. ముందుకొచ్చిన కంపెనీలు : డిప్యూటీ సీఎం
ప్రపంచంలోని అత్యంత రద్దీ గల విమానాశ్రయాల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఒకటి. గతేడాది దాదాపు 7.3 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టును ఉపయోగించారు. అయితే ప్రభుత్వ ఛార్జీలు పెరగడం వల్ల దాదాపు 21 మిలియన్ డాలర్ల మేర జీఎంఆర్ నష్టపోయింది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల యాజమాన్యంలో జీఎంఆర్‌కు మెజారిటీ వాటా ఉంది.
Also Read :Babri Like Fate : బాబ్రీకి పట్టిన గతే ఔరంగజేబు సమాధికీ.. వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ వార్నింగ్
స్వయంగా ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు
హిండాన్ ఎయిర్‌పోర్టు వేదికగా పౌర విమానయాన సర్వీసులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విస్తరిస్తోంది. ప్రతివారం 40 విమాన సర్వీసులను నడిపేందుకు ప్రణాళికను రెడీ చేసింది. హిండాన్ నుంచి నేరుగా బెంగళూరు, చెన్నై, గోవా, జమ్మూ, కోల్‌కతాలకు విమాన సర్వీసులు నడుస్తాయని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. ఇటీవలే ఈ విమాన సర్వీసుల ప్రారంభోత్సవంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. మార్చి 23 నుంచి హిండాన్ – జమ్మూ మధ్య ప్రతిరోజు విమాన సర్వీసు నడవనుంది.