Dawood Ibrahim: చిక్కడు.. దొరకడు.. అంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం!! ఈ క్రూరుడిని ఇప్పటిదాకా మన దేశ భద్రతా సంస్థలు, నిఘా సంస్థలు పట్టుకోలేకపోయాయి. అతడి నేర చరిత్రతో ముడిపడిన పలు ఘట్టాలతో మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ ఓ పుస్తకం రాశారు. దాని పేరు ‘షాకిల్‌ది స్టార్మ్’. అందులోని ఓ వాస్తవిక ఘటనపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim) మాఫియా మహారాష్ట్రలోనే కాదు, పొరుగున ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా అప్పట్లో యాక్టివిటీ కొనసాగించేది. ఆ వివరాలను మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ శైలేంద్ర శ్రీవాస్తవ తన పుస్తకంలో చక్కగా వివరించారు.దాని ప్రకారం.. దావూద్ ఇబ్రహీం కుమార్తె పేరు మహరూఖ్. ఆమె పెళ్లి 2005 జులైలో మక్కాలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ పెళ్లి వేడుకలో మహరూఖ్ ధరించిన గౌనును ఇస్మాయిల్ ఖాన్ అనే దర్జీ కుట్టాడు. ఆ దర్జీ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పుర్ వాస్తవ్యుడు. మహరూఖ్‌కు పెళ్లి అయిన దాదాపు నెల రోజుల తర్వాత ఆగస్టు 14న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసించే ఓ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కుమారుడు నితీశ్ నాగోరి (20) కిడ్నాప్ ఘటన చోటుచేసుకుంది. అతడిని విడుదల చేసేందుకు కిడ్నాపర్లు రూ.4 కోట్లు డిమాండ్ చేశారు. కానీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నితీశ్ నాగోరిని కిడ్నాపర్ల చెర నుంచి విడుదల చేయించారు.
Also Read :Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ నియామకాలతో రిజర్వేషన్లను హరిస్తున్నారు : రాహుల్‌గాంధీ
అయితే ఈ కిడ్నాప్ కేసులో శివ్‌పుర్‌కు చెందిన దర్జీ ఇస్మాయిల్ ఖాన్ హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. దావూద్ ఇబ్రహీం నమ్మినబంటు అఫ్తాబ్ ఆలంకు ఇస్మాయిల్ ఖాన్ అత్యంత సన్నిహితుడని పోలీసుల విచారణలో తేలింది. ఈ కిడ్నాప్ ద్వారా వచ్చే డబ్బులో కొంత వాటా దావూద్‌కు కూడా పంపాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కిడ్నాప్ చేస్తే భారీగా కమిషన్, దుబాయ్‌లో జాబ్, దావూద్ కుమార్తె గౌను కుట్టినందుకు రూ.కోటి నగదు ఇస్తామంటూ దావూద్ మాఫియా నుంచి దర్జీ ఇస్మాయిల్‌కు ఆఫర్ వచ్చింది. దీంతో ఇస్మాయిల్ తన మనుషుల ద్వారా నితీశ్ నాగోరి (20)ని కిడ్నాప్ చేయించాడు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో నితీశ్‌తో సన్నిహితంగా ఉండే మిత్రులు ధ్రువ్, గౌరవ్‌ల సాయాన్ని కూడా దావూద్ ముఠా తీసుకుందని విచారణలో వెల్లడైంది. చివరకు ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇస్మాయిల్, ఆఫ్తాబ్‌లు దుబాయ్‌కు పరారయ్యారు.