Dawood Hospitalized : దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం.. కరాచీలో అత్యవసర చికిత్స ?

Dawood Hospitalized : పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని తెలుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Dawood Hospitalized

Dawood Hospitalized

Dawood Hospitalized : పాకిస్తాన్‌లోని కరాచీలో ఉంటున్న అండర్ వరల్డ్ డాన్ 65 ఏళ్ల దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందని తెలుస్తోంది. విషం ప్రభావంతో తీవ్ర అస్వస్థతకు గురైన దావూద్‌ను హుటాహుటిన చికిత్స  నిమిత్తం కరాచీలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారని(Dawood Hospitalized) తెలుస్తోంది. అయితే ఈ వివరాలను పాక్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు.  దావూద్ చికిత్సపొందుతున్న ఆస్పత్రి చుట్టూ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారని సమాచారం. ఈమేరకు పాక్‌కు చెందిన కొన్ని న్యూస్ ఛానళ్లలో వార్తా కథనాలు కూడా వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 1955 డిసెంబరులో దావూద్ ఇబ్రహీం జన్మించాడు. ప్రారంభంలో అతడు హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో కలిసి పనిచేసే వాడు. ఆ తర్వాత తన సొంత ‘D-కంపెనీ’ని తెరిచాడు. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అతడే. ఆ పేలుళ్లలో 250 మందికిపైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల లిస్టులో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు.  గత కొన్ని దశాబ్దాలుగా అతడు పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న క్లిఫ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు.  అయితే దావూద్ అక్కడ లేదని పాక్ వాదిస్తుంటుంది.

Also Read: Chicken Price : చికెన్ ప్రియులకు షాక్.. కోడి కూర ధరకు రెక్కలు

2003లో అతడిని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించారు. 2023 జనవరిలో దావూద్  మేనల్లుడిని భారత  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దర్యాప్తు చేయగా.. దావూద్ పాకిస్తాన్‌లో మరో వివాహం చేసుకొని జీవిస్తున్నాడని చెప్పాడు. దావూద్ రెండో భార్య పేరు మాహె జబీన్. ఆమె పాక్‌లోని పఠాన్ తెగకు చెందిన మహిళ. దావూద్ తన ఒక కుమార్తె మారుఖ్‌ను జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్‌‌కు ఇచ్చి పెళ్లి చేశారు.

  Last Updated: 18 Dec 2023, 07:57 AM IST