Site icon HashtagU Telugu

Drugs In Toys : బొమ్మలు, లంచ్ బాక్సుల్లో డ్రగ్స్.. దొరికిపోయిన స్మగ్లర్లు

Drugs In Toys

Drugs In Toys

Drugs In Toys : డ్రగ్స్‌ను సప్లై చేసే అక్రమార్కులు చాలా క్రియేటివ్‌గా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఇటీవల చిన్నపిల్లల బొమ్మల్లోనూ డ్రగ్స్‌ను దాచి సీక్రెట్‌గా సప్లై చేస్తున్నారు. ఇలా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డ్రగ్స్ ముఠా గుట్టును గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ పోలీసులు రట్టు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌, కస్టమ్స్, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌‌లో దాదాపు రూ.1.15 కోట్లు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్‌ బాక్స్‌లు, క్యాండీలలో డ్రగ్స్‌ను(Drugs In Toys) దాచి సప్లై చేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కెనడా, అమెరికా, థాయ్‌లాండ్ నుంచి తెప్పించిన గంజాయి స్టాక్‌ను ఈ స్మగ్లర్ల నుంచి సీజ్ చేశారు.

Also Read : Kakatiya Toranam : నగరాల ముస్లిం పేర్లలో రాచరికం కనిపించడం లేదా ? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాదులో డ్రగ్స్ అమ్మకాల జోరు

హైదరాబాదులో డ్రగ్స్ మాఫియాల ఆగడాలు పెరుగుతున్నాయి. డ్రగ్స్ విక్రయిస్తున్న మరో నైజీరియన్ ఒకారో కాస్మోస్ రాంసినితాజాగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చిన ఒకారో కాస్మోస్ రాంసి హైదరాబాదులో డ్రగ్స్‌ను అమ్ముతున్నాడు. అతడు బట్టల వ్యాపారం పేరుతో మన దేశంలోని పలు ప్రాంతాలలో తిరుగుతుంటాడు. ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్‌లోని లాలాగూడ కేంద్రంగా ఇతడు విక్రయాలు చేసేవాడు. ఒకారో కాస్మోస్ రాంసి ప్రధానంగా కుష్, ఓజీ డ్రగ్స్‌ను అమ్మేవాడు. తాజాగా ఇతడి వద్ద దొరికిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 10 లక్షలు ఉంటుంది. కుష్, ఓజీ డ్రగ్స్ ఆఫ్రికా, అమెరికాలో విరివిగా లభిస్తుంటాయి. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల కాలేయం, కిడ్నీ సమస్యలు వస్తాయని అంటున్నారు. వాస్తవానికి 2016లోనే గోల్కొండ పోలీసులు ఒకారో కాస్మోస్ రాంసితో పాటు మరో నైజీరియన్ ను డ్రగ్స్ విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. బెయిల్ పై విడుదలయ్యాక బెంగళూరుకు చెందిన ఒబాసి అనే నైజీరియన్‌కు హైదరాబాద్ లో పెడ్లర్ గా మారాడు. ఈక్రమంలో 2018లోనూ గోల్కొండ ఎక్సైజ్ పోలీసులు కొకైన్ సరఫరా చేస్తుండగా ఒకారో కాస్మోస్ రాంసిని అరెస్టు చేశారు.  ఆ తర్వాత కూడా అతడు బెయిల్‌పై రిలీజై షరా మామూలుగా డ్రగ్స్ దందాను కొనసాగించాడు.

Also Read : Bandi Sanjay : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం..సీఎం రేవంత్‌కు బండి సంజయ్‌ లేఖ