Jharkhand: 4 రోజుల నవజాత శిశువు మృతి.. పోలీసులే కారణమా..?

ఝార్ఖండ్ (Jharkhand)లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాల్ని కలిచి వేసింది. గిరిదిహ్ జిల్లాలో నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయి మృతిచెందడంతో ఆరుగురు పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 07:47 AM IST

ఝార్ఖండ్ (Jharkhand)లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాల్ని కలిచి వేసింది. గిరిదిహ్ జిల్లాలో నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిపోయి మృతిచెందడంతో ఆరుగురు పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అంతకుముందు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన జిల్లాలోని కొసోగొండోడిగి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. నిందితుడిని వెతకడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. నిందితుడు చనిపోయిన చిన్నారికి తాత.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు భూషణ్ పాండేపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో డియోరీ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సంగమ్ పాఠక్ నేతృత్వంలోని బృందం ఇంటికి వెళ్లింది. పోలీసులను చూసి భూషణ్ కుటుంబ సభ్యులంతా ఇంట్లో ఒంటరిగా ఉన్న శిశువును వదిలి పారిపోయారు. చిన్నారి తల్లి నేహా దేవి మాట్లాడుతూ.. పోలీసులు ఇంట్లోని ప్రతి మూల మూలలో వెతుకుతుండగా, వారి నాలుగు రోజుల శిశువు లోపల నిద్రిస్తోందని చెప్పారు. పోలీసు బృందం వెళ్లిన తర్వాత ఇంటికి చేరుకోగా, తన బిడ్డ శవమై కనిపించింది. పోలీసులు తమ బూట్లతో చిన్నారిని చితకబాది చంపారని మృతుడి తల్లి, భూషణ్ పాండేతో సహా ఇంట్లోని ఇతర సభ్యులు ఆరోపిస్తున్నారు.

Also Read: Mamata Banerjee: నవీన్ పట్నాయక్‌ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?

బుధవారం జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో ఒక నవజాత శిశువు పోలీసు బూట్ల కింద నలిగిచనిపోయిన కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు. డియోరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోషోడింఘి గ్రామంలో ఒక కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసేందుకు పోలీసు సిబ్బంది ఇంటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ రాణా మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. ఇలాంటి ఘటనలను ఖండిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తోందని, పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.