Site icon HashtagU Telugu

CRPF Jawan Self Dead: ఐబీ డైరెక్టర్ ఇంట సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

Suicide

Deadbody Imresizer

న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసంలో 53 ఏళ్ల సిఆర్పిఎఫ్ జవాన్ (CRPF Jawan) శుక్రవారం మధ్యాహ్నం తన సర్వీస్ రైఫిల్ AK-47తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన సీనియర్ అధికారులు ఈ ఘటనను ధృవీకరించారు. 53 ఏళ్ల సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఇక్కడ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం వద్ద ఉన్న గార్డు పోస్ట్ వద్ద తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

Also Read: Jewelery: నగల దుకాణంలో చోరీకొచ్చి సారీ అని వెళ్లిపోయిన దొంగలు

మృతుడు రాజ్‌బీర్ ని మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటన గురించి బలగాలకు సమాచారం అందించగా జిల్లాకు చెందిన సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. మృతుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం వద్ద గార్డ్ పోస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.