Bus Accident : జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 15 మందికిపైగా గాయాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. సుమారు 23 మంది సిబ్బందితో వెళ్తున్న ఈ బస్సు, కాండ్వా సమీపంలో బసంత్‌గఢ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం తీవ్రత దృష్ట్యా వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Donald Trump Tariffs : బిలియన్ల సంపద రాబోతుందంటూ సంబరాల్లో ట్రంప్
అదనపు ఎస్పీ సందీప్ భట్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమికంగా విచారణ ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన వాహనం ప్రమాదానికి గురవడం దురదృష్టకరం. సహచర జవాన్లను కోల్పోయిన మిగిలిన సిబ్బంది ఆవేదనలో ఉన్నారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని