Site icon HashtagU Telugu

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్.. ఎందుకంటే ?

FIR Against N Sitharaman

Nirmala Sitharaman : బెంగళూరు నగరంలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని ఆ ఆర్డర్స్‌లో పేర్కొంది.  దీంతో బెంగళూరు సిటీ పోలీసులు నిర్మలా సీతారామన్, పలువురు బీజేపీ నాయకులపై కేసు నమోదు చేశారు.

Also Read :Medical Bills : పేదలకు దడ.. పెరిగిపోతున్న మెడికల్ బిల్స్.. సంచలన నివేదిక

‘‘ఎన్నికల బాండ్ల పేరిట పలువురు పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి బెంగళూరు నగరంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు నేను వెళ్లాను.  అయితే వారిపై కేసు నమోదు చేయడానికి తిలక్ నగర్ పోలీసులు నిరాకరించారు’’ అని జనాధికార సంఘర్ష పరిషత్తు (జేఎస్ పీ) నాయకుడు ఆదర్శ్ అయ్యర్ ఆరోపించారు. దీనిపై గత ఏడాది ఏప్రిల్ నెలలో బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టులో ఆదర్శ్ అయ్యర్ పిటిషన్ వేశారు.

Also Read :Irans Supreme Leader : ఇజ్రాయెల్ భయం.. రహస్య ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు బీజేపీ నేత నళిన్ కుమార్ కటేల్, బీవై విజయేంద్రపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆయన(Nirmala Sitharaman) కోరారు. దీనిపై తాజాగా విచారించిన బెంగళూరు ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, తదితరులపై కేసు నమోదు చేయాలని తిలక్ నగర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను  అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. ఏదిఏమైనప్పటికీ ఈ పరిణామంలో బీజేపీకి పెద్ద షాక్ తగిలినట్లయింది. ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలను సేకరించే వ్యవస్థ సవ్యంగా లేదని పేర్కొన్న భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) .. ఆ పద్ధతిని రద్దు చేసింది. ఇక ఆ వ్యవస్థ విరాళాలను సేకరించకూడదని కొన్ని నెలల క్రితమే నిర్దేశించింది.

Also Read :Hate Rich People : డబ్బున్న వాళ్లంటే మనదేశంలో ద్వేషమెందుకో చెప్పిన జెరోధా సీఈఓ