Site icon HashtagU Telugu

Democracy in Danger: రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది: సోనియా గాంధీ

Sonia Gandhi

Sonia Gandhi

Democracy in Danger: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై సోనియా గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. గత పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని, వివక్ష, దౌర్జన్యాలను మాత్రమే ప్రచారం చేసిందని అన్నారు. ప్రతిచోటా అన్యాయమే జరిగిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో చీకట్లు అలుముకుంటున్నాయని, న్యాయ వెలుగు కోసం మనమందరం పోరాడాలని అన్నారు. మోదీ ప్రభుత్వం ఏం చేసిందో మనందరికి తెలుసని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జైపూర్‌లో కాంగ్రెస్‌ ఈరోజు మెగా ర్యాలీ నిర్వహిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా ర్యాలీకి చేరుకున్నారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రసంగిస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వివక్ష మరియు దౌర్జన్యాలను ప్రోత్సహించే ప్రభుత్వమే మన దేశానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని సోనియా అన్నారు. విపక్ష నేతలపై బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీలో చేరేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారని అన్నారు. ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతోంది’ అని జైపూర్ ర్యాలీలో సోనియా గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు.

We’re now on WhatsAppClick to Join

మరోవైపు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరాయని, ప్రతి రాష్ట్రంలో పేపర్లు లీక్ అవుతున్నాయని ప్రియాంక గాంధీ అన్నారు. పేదలు, రైతుల మాట వినేవారు లేరన్నారు. ప్రజలు వేసే ఓటు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఏర్పాటైన పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యం కావడం ద్వారా మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులను దుర్వినియోగం చేస్తున్నారని, నేడు ఈవీఎంలను కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి నెలకొందని ప్రియాంక అన్నారు.

Also Read: TDP : చంద్రబాబు సమక్షంలో కండువా కప్పుకున్న పాకాల జడ్పీటీసీ

Exit mobile version