Site icon HashtagU Telugu

Book On Ayodhya: సల్మాన్ ఇంటిపై దాడి. రాళ్లతో రువ్వి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

సల్మాన్ ఇంటిపై దాడి. రాళ్లతో రువ్వి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్ ఇంటిపై దాడి జరిగింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం నైనిటాల్‌లో సల్మాన్‌ ఖుర్షీద్ ఉంటున్న‌ ఇంటిపై దాడి చేసిన కొందరు ఇంటిపైకి రాళ్లు రువ్వి, నిప్పు పెట్టారు.

తాజాగా సల్మాన్‌ ఖుర్షీద్‌ అయోధ్య అంశంపై రాసిన సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్ హుడ్ ఇన్ అవర్ టైమ్స్ అనే పుస్తకం రాయడం వల్లే సల్మాన్ ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం.

సల్మాన్ తన పుస్తకంలో హిందుత్వపై ఘాటైన విమర్శలు చేశారు. గతంలో హిందూమతం బాగుండేది కానీ ప్రస్తుత హిందుత్వ చాలా దుర్మార్గమైనదని సల్మాన్ ఆరోపించారు. ఐసీస్, బోకో హరామ్ వంటి ఇస్లామిక్ జిహాదీ గ్రూపులతో పోల్చితే ఇప్పటి హిందుత్వకు పెద్ద తేడా ఏమీ లేదని సల్మాన్ పేర్కొన్నారు.

ఈ పుస్తకం ఆవిష్కరణ అయినప్పటి నుండి బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ పుస్తకంమతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తోందని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెన్డ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయోధ్యపై ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

అయితే సల్మాన్ ఖుర్షిద్ మాత్రం తన పుస్తకాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. తానేమీ అబద్దాలు రాయలేదని, ప్రస్తుత పరిస్థితులనే పుస్తకరూపంలో బయటపెట్టానని ఖుర్షిద్ తెలిపారు.

Also Read: కంగనా వ్యాఖ్యలపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ

సల్మాన్ ఖుర్షిద్ పుస్తకంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అభ్యంతరం తెలిపారు. ఖుర్షిద్ తన పుస్తకాన్ని బ్యాన్‌ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు రాజాసింగ్ లేఖ రాశారు. ఇక ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

Also Read: కోటి రూపాయ‌ల ఆస్తిని రిక్షా పుల్ల‌ర్ కి ఇచ్చేసిన మ‌హిళ‌…!