దేశ వ్యాప్తంగా కూడా ఇక కాంగ్రెస్ పార్టీ (Congress) పనియిపోయిందని తాజా ఢిల్లీ ఫలితాలతో అర్థమైపోతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి మూటకట్టుకోగా..ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేని పరిస్థితికి దిగజారిపోయింది. మొత్తం 70 స్థానాల్లో బిజెపి 41 , ఆప్ పార్టీ 29 మధ్య పోటీ పడుతున్నాయి.
Delhi Election Results 2025 : 17 నియోజకవర్గాల చేతిలో ‘ఢిల్లీ పీఠం’
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల చరిత్రను చూస్తే.. 1952-2020 మధ్య ఎనిమిది సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగుసార్లు అధికారం దక్కించుకుంది. కానీ 2015, 2020 ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేక పూర్తిగా పతనమైంది. ఇప్పుడు 2025 ఎన్నికల్లోనూ హ్యాట్రిక్ డకౌట్ దిశగా కాంగ్రెస్ ప్రయాణిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం ఒకేఒక్క స్థానం స్వల్ప ఆధిక్యతతో నిలిచినప్పటికీ, కౌంటింగ్ పూర్తయ్యే సరికి అది కూడా కోల్పోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన మద్దతుదారులను కోల్పోతూ వస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో బలమైన పార్టీగా వెలుగొందిన కాంగ్రెస్, ఇప్పుడు ఓటమి వరుసతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ప్రచారంలో తీవ్ర వైఫల్యం, నాయకత్వ సమస్యలు, బీజేపీ వ్యూహాలకు తగిన ప్రత్యామ్నాయాన్ని చూపలేకపోవడం కాంగ్రెస్‌ను మరింత క్షీణించేటట్లు చేశాయి.
Delhi Election Results 2025 : ముస్లింల ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం..కారణం ఇదే..!!
ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీకి ప్రత్యర్థిగా నిలవాల్సిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ స్థాయిని కూడా కోల్పోతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వంటి కొత్త రాజకీయ శక్తులు పుంజుకోవడంతో, కాంగ్రెస్‌కు మద్దతు ఇంకా దెబ్బతింటోంది. ఓవరాల్ గా చూస్తే ఢిల్లీలో ఈసారీ ఘోర పరాజయాన్ని చవిచూస్తున్న కాంగ్రెస్, దేశవ్యాప్తంగా పునరుజ్జీవనానికి దారులు వెతకాల్సిన అవసరం ఉంది.