INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్‌ వదులుకుంటే బెటర్ : మణిశంకర్‌ అయ్యర్‌

కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్‌ అయ్యర్‌(INDIA bloc) చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Mani Shankar Aiyar Congress India Bloc Rahul Gandhi Priyanka Gandhi

INDIA bloc : అవసరమైతే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సారథ్య బాధ్యతలను వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడాలని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్‌ అయ్యర్‌ సూచించారు. మరేదైనా విపక్ష పార్టీకి చెందిన నేతకు ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను అప్పగిస్తే బాగుంటుందన్నారు. మమతా బెనర్జీ లాంటి నేతలకు విపక్ష కూటమిని నడిపే సత్తా, రాజకీయ చతురత ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేస్తేనే.. ఇండియా కూటమికి సమర్ధమైన నాయకత్వం లభించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ‘‘ఇండియా కూటమికి సారథిగా మరో పార్టీ నేత ఉన్నా..  కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమేం తగ్గదు. కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్‌ అయ్యర్‌(INDIA bloc) చెప్పారు.

Also Read :Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ

‘‘రాజకీయాల్లో నేను అంచెలంచెలుగా ఎదగడానికి గాంధీ కుటుంబం ఎంతైతే కారణమో.. నా పతనానికి కూడా గాంధీ కుటుంబం అంతే కారణం’’ అని ఇటీవలే  మణిశంకర్‌ అయ్యర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్ల పాటు పార్టీకి సేవ చేసినా, అగ్రనాయకత్వం తనను సస్పెండ్‌ చేసిందని ఆవేదన వెలిబుచ్చారు. ఈక్రమంలోనే ఇప్పుడు మరోసారి హస్తం పార్టీకి సూచనలు చేస్తూ ఆయన కామెంట్స్ పెట్టడం గమనార్హం.

Also Read :Smita Sabharwal : సిన్సీయర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌‌.. ‘కాళేశ్వరం’ విషయంలో మీడియా ఓవర్ యాక్షన్

యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన టైంలో ప్రణబ్ ముఖర్జీని ప్రధానిగా చేసి.. మన్మోహన్ సింగ్‌ను రాష్ట్రపతిగా ప్రమోట్ చేసి ఉండాల్సిందని ఇటీవలే మణిశంకర్‌ అయ్యర్‌ పేర్కొన్నారు. ఒకవేళ ఆనాడు యూపీఏ సర్కారు అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే.. 2014లో అవమానకర రీతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదే కాదన్నారు. తన రాజకీయ జీవితంలోని కీలక పరిణామాల వివరాలతో రాసిన  కొత్త పుస్తకంలో ఈ అంశాలను మణిశంకర్ అయ్యర్ ప్రస్తావించారు.

  Last Updated: 23 Dec 2024, 03:49 PM IST