Site icon HashtagU Telugu

Congress plenary : సోనియా ఆఖ‌రి ఇన్నింగ్స్ `భార‌త్ జోడో`

Congress Plenary

Congress Plenary 3

రాజ‌కీయాల్లో చివ‌రి ఇన్నింగ్స్ ను ఏఐసీసీ మాజీ అధ్య‌క్షురాలు సోనియా (Congress plenary) ప్ర‌క‌టించారు. భార‌త్ జోడో యాత్ర(Bharath jodo) త‌న చివ‌రి ఇన్నింగ్స్ గా వెల్ల‌డించారు. పొలిటిక‌ల్ రిటైర్మెంట్‌పై ప‌రోక్షంగా శనివారం ప్లీన‌రీ వేదిక‌గా ఆమె మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. భార‌త్ జోడోతో త‌న ఇన్నింగ్స్ ముగియవచ్చని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం జరుగుతోంది. సదస్సు రెండో రోజైన శనివారం, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ ఇన్నింగ్స్ ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశం అయింది.

రాజ‌కీయాల్లో  సోనియా చివ‌రి ఇన్నింగ్స్  (Congress plenary)

భార‌త్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఒక‌ మలుపుగా ఆమె భావించారు. భారతదేశ ప్రజలు సామరస్యం, సహనం సమానత్వం కోరుకుంటున్నారని జోడో యాత్ర ద్వారా నిరూప‌ణ అయింద‌ని అన్నారు.కాంగ్రెస్‌కు, యావత్ దేశానికి సవాలుతో కూడుకున్న ఈ సమయం కీల‌క‌మ‌న్నారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలోని ఒక్కో సంస్థను తమ ఆధీనంలోకి తీసుకుని, ధ్వంసం చేశాయ‌ని అన్నారు. కొంతమంది వ్యాపారులకు లబ్ధి చేకూర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ(Congress plenary) ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ చాలా సాధించింది, కానీ ఇప్పుడు క్లిష్ట దశను దాటుతోందని అన్నారు. దేశంలో విద్వేషాల కారణంగా మహిళలు, గిరిజనులు, పేదలు, వెనుకబడిన వారిపై దాడులు పెరిగాయ‌ని అన్నారు. వాటిని అంతం చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే సాధ్య‌మ‌న్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టించిందని సోనియా గాంధీ..

2004 మరియు 2009లో మా విజయాలు, అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ యొక్క సమర్థ నాయకత్వం నాకు వ్యక్తిగత సంతృప్తినిచ్చాయని సోనియా గాంధీ అన్నారు. వాటి కంటే భార‌త్ జోడో యాత్ర (Bharath jodo)ద్వారా కాంగ్రెస్ కీల‌క మ‌లుపు మ‌రింత సంతోషాన్నిస్తుంద‌ని పేర్కొన్నారు. మల్లికార్జున్ ఖర్గేకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉందని, ఇలాంటి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి ఆయన చైర్మన్ పదవి అవసరమని అన్నారు. ఖర్గే అధ్యక్షతన ఈ కష్ట కాలాన్ని కూడా అధిగమించగలుగుతామ‌ని ధీమా వ్య‌క్త‌ప‌రిచారు.

Also Read : Congress plenary:CWCనిబంధ‌న స‌డ‌లింపు!తొలి రోజు ప్లీన‌రీ సంద‌డి!

రెండో రోజు సమావేశాల్లో 15 వేల మంది పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. భార‌త్ జోడో యాత్ర‌తో త‌న ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చని చెప్పారు.సామ‌ర‌స్యం, స‌హ‌నం, స‌మాన‌త్వం కోసం దేశ ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్న‌ట్లు భార‌త్ జోడో యాత్ర‌తో (Bharat jodo) తెలిసింద‌ని సోనియా అన్నారు.కాంగ్రెస్ సిద్ధాంతాలతో ఏకీభవించే పార్టీలను గుర్తించాలని చెప్పింది. సారూప్య సిద్ధాంతాల ఆధారంగా విపక్ష పార్టీలను తక్షణమే ఏకం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు బీజేపీకే లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడింది.

సెక్యులర్, సోషలిస్ట్ పార్టీలను ఏకం చేయడమే కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో మన దేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే సరైన నాయకత్వాన్ని అందించగలదని చెప్పింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలు థర్డ్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న తరుణంతో కాంగ్రెస్ పార్టీ తీర్మానం ఆసక్తికరంగా మారింది.2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల సెక్యులర్ పార్టీలను కలుపుకుని ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ‘గుర్తించడం, సమీకరించడం, కలిసి పని చేయడం’ అనే ఫార్ములా ప్రకారం ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగాలని చెప్పింది. సెక్యులర్, సోషలిస్ట్ పార్టీలను ఏకం చేయడమే కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళిక అని తెలిపింది.

Also Read : Congress plenary : పొత్తుల‌కు కాంగ్రెస్ పిలుపు! త్యాగాల‌కు సిద్ధ‌మ‌న్న ఖ‌ర్గే!!