Site icon HashtagU Telugu

Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ కసరత్తు

Lok Sabha Polls

Lok Sabha Polls

Lok Sabha Polls: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ దిశగా చకచకా నిర్ణయాలు తీసుకుంటుంది హైకమాండ్. ఈ మేరకు వచ్చే లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గ మేనిఫెస్టో ముసాయిదాను రూపొందించేందుకు కాంగ్రెస్ ప్యానెల్ గురువారం మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమవేశంలో మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ప్యానెల్ చైర్‌పర్సన్ గా చిదంబరం ఉన్నారు.

10 ఏళ్ల తర్వాత బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో కాంగ్రెస్ ప్రజలకు ప్రత్యామ్నాయ సానుకూల ఎజెండాను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.చిదంబరంతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఛత్తీస్‌గఢ్‌ మాజీ డిప్యూటీ సీఎం టీఎస్‌ సింగ్‌ డియో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సింగ్ డియో ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, జైరామ్ రమేష్, శశి థరూర్, రంజీత్ రంజన్, గౌరవ్ గొగోయ్, కె రాజు మరియు గైఖంగం కూడా కమిటీలో భాగమై సమావేశానికి హాజరయ్యారు.

Also Read: World’s Oldest Whiskey: వందల ఏళ్ల క్రితం నాటి విస్కీ ఇది.. ధరెంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..