PM Modi: గిరిజన మహిళ రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది: మోడీ

ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి ప్రయోజనం అందేలా చూడాలన్నదే బీజేపీ విధానమని చెప్పారు.

PM Modi: ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, ప్రగతి ప్రయోజనం అందేలా చూడాలన్నదే బీజేపీ విధానమని చెప్పారు. సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి, పురోభివృద్ధి ఫలాలు అందడమే బీజేపీ విధానమని.. చరిత్రలో తొలిసారి గిరిజన కుటుంబానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయాలని బిజెపి నిర్ణయించిందని, కాని కాంగ్రెస్ దానిని వ్యతిరేకించిందని కామెంట్స్ చేశారు ప్రధాని మోడీ.

ఈ రోజు ఛత్తీస్గఢ్ ప్రచారంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలకు పాల్పడ్డారు. గిరిజనులు మరియు వెనుకబడిన వారి హక్కులను పరిరక్షించడం బిజెపి లక్ష్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రశ్రేణి రాష్ట్రాల్లోకి తీసుకురావడమే బిజెపి లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ మరియు అభివృద్ధి కలిసి ఉండలేవు అని ప్రధాని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలకుల వైఫల్యాన్నిప్రజలు గమనించారు. ఇన్నేళ్లలో కాంగ్రెస్ నాయకులు, వారి బంధువులు మాత్రమే ఆస్తుల్లో అభివృద్ధి చెందారని విమర్శించారు. అసాధ్యమనిపించిన పనులను తొమ్మిదేళ్ల క్రితం తమ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. మోదీ హామీ అంటే ప్రతి హామీని నెరవేర్చే హామీ అని.. తొమ్మిదేళ్ల క్రితం అసాధ్యమనిపించిన పనులను పూర్తిచేశామని, లోకసభ, అసెంబ్లీల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మోదీ హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. పేదల సంక్షేమమే కేంద్రంలోని తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు.

ఛత్తీస్గఢ్లో 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 7, నవంబర్ 17 తేదీల్లో పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ జరగనుండగా.. ఛత్తీస్గఢ్ మినహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన, ఆ నియోజకవర్గ మొత్తానికి దళితబంధు!