హరియాణా (Haryana), జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడనున్నాయి. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. హరియాణాలో కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్లే ఫలితాలు వెల్లడవుతూ వస్తున్నాయి. కొద్దీ సేపటి వరకు హర్యానా లో కాంగ్రెస్ లీడ్ కనిపించగా..ప్రస్తుతం బిజెపి లీడ్ లోకి వచ్చినట్లు తెలుస్తుంది.
ఇక హరియాణా, జమ్మూకశ్మీర్లో ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. ఢిల్లీలోని AICC ఆఫీస్ వద్ద లడ్డూలు, జిలేబీలు పంచుకుంటూ.. ఆనందంతో ఒకరికొకరు తినిపించుకుంటున్నారు. పెద్ద ఎత్తున బాణసంచాను సిద్ధం చేస్తున్నారు. హరియాణాలో ఈనెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరుగగా.. 67.9 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ (బీజేపీ), కాంగ్రెస్ మధ్య పోటి నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ ఫిగర్ 46 సీట్లు రావాలి. కాగా, హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ నేతల ధీమా వ్యక్తం చేస్తుంటే..ఈసారి తమదే విజయమని కాంగ్రెస్ చెపుతుంది. ప్రస్తుతం ఇక్కడ 44 స్థానాల్లో బిజెపి ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 37 చోట్ల, ఇతరులు 9 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు.
ఇక జమ్మూ విషయానికి వస్తే.. ఇక్కడ 90 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికలు కావడం వల్ల జమ్ముకశ్మీర్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సీ కలిసి పోటీ చేశాయి. ప్రస్తుతం ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ లీడ్ లో ఉంది.
Read Also : Afzal Gurus Brother: ఎన్నికల బరిలో అఫ్జల్ గురు సోదరుడు.. భవితవ్యం తేలేది నేడే