Congress Party: మహారాష్ట్రలో విపక్షాల సీట్ల సర్దుబాటు..కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!

  • Written By:
  • Updated On - March 1, 2024 / 12:16 PM IST

 

Maharashtra India Alliance Seat Sharing : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏను ఢీకొట్టడమే లక్ష్యంగా మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్‌(congress), మహారాష్ట్రలో 18 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 48 లోక్‌సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈ మేరకు మహావికాస్‌ అఘాడీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. 48 గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలోని శివసేన 20 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ప్రాంతీయ పార్టీ అయిన వంచిత్‌ బహుజన్‌ అఘాడికి శివసేన 2 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడింది. శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్​సీపీ 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించనుంది. ఒక స్వతంత్ర అభ్యర్థికి పవార్‌ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఇప్పటికే యూపీలో సమాజ్‌వాదీ పార్టీతో, ఢిల్లీ, పంజాబ్‌, గుజరాత్‌, హరియాణాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు వచ్చింది.

read also : Success Stories : నైట్ వాచ్‌మన్‌‌కు మూడు జాబ్స్.. గృహిణికి రెండు జాబ్స్