Site icon HashtagU Telugu

Congress 2024 : ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సారథిగా చిదంబరం.. సభ్యులు ఎవరెవరంటే ?

Congress 2024

Congress 2024

Congress 2024 : రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేయడానికి 16 మందితో కూడిన కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరంను, కన్వీనర్‌గా  ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్‌.సింగ్‌దేవ్‌‌ను ఎంపిక చేశారు. మిగతా 14 మంది కమిటీ సభ్యుల జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ఇతర సభ్యులలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఆనంద్ శర్మ, శశి థరూర్,  జైరాం రమేష్ (కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ – కమ్యూనికేషన్స్), మణిపూర్ మాజీ ఉపముఖ్యమంత్రి గైఖంగమ్ గాంగ్‌మీ ఉన్నారు. ఈ  ప్యానెల్‌లో కాంగ్రెస్ లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెడ్ ప్రవీణ్ చక్రవర్తి, కె రాజు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీల జాతీయ కోఆర్డినేటర్), కాంగ్రెస్ మైనారిటీ విభాగం అధిపతి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఓంకార్ సింగ్ మార్కం (మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే), రంజీత్ రంజన్ (రాజ్యసభ ఎంపీ), జిగ్నేష్ మేవానీ (గుజరాత్ ఎమ్మెల్యే), ఏఐసీసీ కార్యదర్శి (పరిపాలన), పార్టీ అధ్యక్ష కార్యాలయం సమన్వయకర్త గురుదీప్ సప్పల్  కూడా ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీలో దక్షిణాది నేతలకు కీలక హోదాలు దక్కడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

2024 లోక్‌సభ ఎన్నికలు సమీపించిన వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఎన్నికల సంఘం(Congress 2024) కీలక ఆదేశాలు ఇచ్చింది. సొంత రాష్ట్రాలలో నియమించబడిన అధికారులతో పాటు చాలా ఎక్కువ కాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జూన్‌లో వేర్వేరు తేదీల్లో ముగియనుంది.  2014లో కూడా ఈ నాలుగు రాష్ట్రాలలో పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.