Congress AAP: కాంగ్రెస్, ఆప్​ మధ్య పొత్తు ఖరారు..సీట్ల సర్దుబాటు వివరాలు

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 01:44 PM IST

 

 

Congress AAP Seat Sharing : లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్(Congress), ఆప్(AAP)​ మధ్య పొత్తు ఖరారైంది. ఢిల్లీ, గుజరాత్​, హరియాణా, చంఢీగఢ్, గోవాలో సీట్ల సర్దుబాటు వివరాలను ప్రకటించారు. పొత్తులో భాగంగా ఢిల్లీలో ఆప్‌ నాలుగు, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు. గోవాలో ఉన్న రెండు లోక్​సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గుజరాత్​లో భరూచ్, భావ్​ నగర్​ స్థానాల్లో ఆప్​ పోటీ చేస్తుందని చెప్పారు. మిగిలిన 24 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని వివరించారు. హరియాణాలో ఆప్​ కురుక్షేత్ర స్థానం నుంచి పోటీ చేస్తుందని తెలిపారు. ఇక చంఢీగఢ్​లో ఉన్న ఏకైక సీటులో కాంగ్రెస్ పోటీ చేయనుందని వెల్లడించారు.

2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​, ఆప్​ పోటీ చేసే స్థానాలు :

రాష్ట్రం (మొత్తం సీట్లు)    కాంగ్రెస్   ఆప్
ఢిల్లీ (7)         3                        4           –
హరియాణా(10)                      9           1
గుజరాత్ (26)                        24         2
చంఢీగఢ్ (1)                           1           –
గోవా (2)                                   2           –

We’re now on WhatsApp. Click to Join.

అయితే పంజాబ్(Punjab)లో మాత్రం కాంగ్రెస్, ఆప్ విడివిడిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు ఆప్​ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే పంజాబ్​లో వేర్వేరుగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ‘ప్రస్తుతం దేశానికి బలమైన ప్రత్యామ్నాయం అవసరం. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ కూటమి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పోరాడుతుంది. పొత్తుల వల్ల బీజేపీ(bjp) లెక్కలు తప్పుతాయి’ అని పాఠక్​ అన్నారు.

read also: Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..