Site icon HashtagU Telugu

Mamata Banerjee : ప్రధాని మోడీకి వార్నింగ్ వ్యాఖ్యలు.. సీఎం దీదీపై పోలీసులకు ఫిర్యాదు

Cm Mamata Banerjee Has Writ

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ‌కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది వినీత్ జిందాల్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘మోడీజీ.. మీరు బెంగాల్‌లో అశాంతిని క్రియేట్ చేసేందుకు యత్నిస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు బెంగాల్‌ను తగలబెడితే.. అసోం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీకి కూడా మంటలు వ్యాపిస్తాయి’’ అని పేర్కొంటూ ఇటీవలే మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను సదరు న్యాయవాది తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, అశాంతిని రగిల్చేలా ఉన్నాయని తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join

దేశంలోని రాష్ట్రాల మధ్యనున్న సామరస్య భావనను దెబ్బతీసేలా, శత్రుత్వ భావనను కలిగించేలా మమతా బెనర్జీ కామెంట్లు ఉన్నాయని న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. మమతా బెనర్జీపై బీఎన్ఎస్‌లోని 152, 192, 196, 353 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పశ్చిమ బెంగాల్ సీఎం తీవ్రమైన నేరం చేశారని చెప్పారు.

Also Read :Operation Bhediya : డ్రోన్లు, థర్మల్‌, ఇన్ఫ్రారెడ్‌ కెమెరాలతో ‘ఆపరేషన్‌ భేడియా’.. ఏమిటిది ?

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటనను ఖండిస్తూ నిరసన తెలుపుతున్న డాక్టర్లకు వార్నింగ్ ఇచ్చేలా ఇటీవల మమతా బెనర్జీ(Mamata Banerjee) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బెంగాల్ రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది. ఎఫ్‌ఐఆర్ నమోదైతే వీసాలు, పాస్‌పోర్టులను పొందే విషయంలో డాక్టర్లకు ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొంటూ మమతా బెనర్జీ చేసిన కామెంట్స్‌లో స్పష్టమైన హెచ్చరిక దాగి ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. బీజేపీ ఆరోపణలపై  ఇవాళ  ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపించాయని దీదీ మండిపడ్డారు.   ఉద్దేశపూర్వకంగానే తన వ్యాఖ్యలను తప్పుగా చూపించారని తెలిపారు. తాను డాక్టర్లను బెందిరించలేదని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు, ప్రజా  సంఘాల ఉద్యమాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని తేల్చి చెప్పారు. వారి ఉద్యమానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Also Read :Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ