గ్యాస్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు మరోసారి శుభవార్త తెలిపాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల LPG సిలిండర్ (Commercial Gas Cylinder Price today) ధరను రూ.33.50 తగ్గించాయి. ఈ కొత్త ధరలు ఆగస్టు 1 నుండి అమలులోకి వస్తాయని కంపెనీలు తెలిపాయి. ఈ తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1631.50కి చేరనుంది. ఈ ధరల తగ్గింపు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ స్టాల్స్, చిన్న దుకాణదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. అయితే, ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు స్పష్టం చేశాయి.
ఇది వాణిజ్య LPG సిలిండర్ల ధరలు తగ్గడం వరుసగా ఐదవ నెల కావడం విశేషం. గతంలో జూలై 1, 2025న వాణిజ్య LPG ధరను రూ.58.50 తగ్గించారు. అప్పుడు ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1665గా ఉండేది. జూన్‌లో రూ.24, మేలో రూ.14.50, ఏప్రిల్‌లో రూ.41 చమురు కంపెనీలు తగ్గించాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర తగ్గితే ఎంత మందికి లబ్ధి చేకూరుతుందో, వాణిజ్య సిలిండర్ ధర తగ్గించినప్పటికీ పరోక్షంగా అంతే మందికి ప్రయోజనం కలుగుతుంది.
Telangana BRS MLA Defection Case : తెలంగాణ లో మరోసారి ఎన్నికలు..? నిజమేనా..?
తాజా తగ్గింపు తర్వాత కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1769.00 నుండి రూ.1735.50కి తగ్గింది. అదేవిధంగా, ముంబైలో రూ.1616.50 నుండి రూ.1583.00కి, చెన్నైలో రూ.1823.50 నుండి రూ.1790కి తగ్గనుంది. ఇది వ్యాపారాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు.
గత 8 సంవత్సరాల్లో చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను ఏడు సార్లు తగ్గించాయి. మార్చిలో ధర ఒక్కసారి పెరిగినప్పటికీ, ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం వ్యాపార వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తోంది.