తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జమిలి ఎన్నికల (Jamili Elections) గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి మార్పులు రాబోతున్నాయని, అదే సమయంలో జమిలి ఎన్నికలు కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో నాయకులు సిద్ధంగా లేకపోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోతారని హెచ్చరించారు. డ్రైక్లీనింగ్ ఇస్త్రీ బట్టల్లా పార్టీ వద్దకు రాకూడదని, ప్రజలతో కలిసి ఉండాలని సూచించారు. అభివృద్ధిలో భాగస్వాములై పనిచేస్తే, పార్టీ వారికి పదవులు, గౌరవాలు కల్పిస్తుందన్నారు.
CM Revanth Reddy: చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా: సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం, అభ్యర్థి ఎంపిక అధిష్టానానిదేనని స్పష్టం చేశారు. పార్టీ కమిటీల్లో ఉన్న నాయకులు మైదానంలోకి వచ్చి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. గతంలో చిన్న చిన్న బాధ్యతలు వహించేందుకు ముందుకు వచ్చినవారే ఇప్పుడు పెద్ద పదవులు పొందారని గుర్తు చేశారు. పార్టీ నిర్మాణంలో కృషి చేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీలు, ఆలయాల కమిటీలు లాంటి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.
Neopolis: రూ. 3169 కోట్లతో నిర్మాణం.. హైదరాబాద్‌లో నియోపోలిస్ భారీ ప్రాజెక్ట్!
తెలంగాణలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అదే విధంగా పదేళ్లపాటు పాలన సాగుతుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ, ప్రభుత్వం కలిసి జోడెద్దుల్లా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. 18 నెలల పాలనను “గోల్డెన్ పీరియడ్”గా అభివర్ణిస్తూ, ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని, వాటిని అధిగమించేందుకు పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉండాలన్న అవసరం ఉందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీ సన్నద్ధం కావాలంటూ ఆదేశించారు.