ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను ఆపే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నీటి కొరత తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth ), కేంద్రంతో నేరుగా చర్చలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటీల్(Union Minister CR Patil)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు.
Jagan : చంద్రబాబుపై జగన్ సంచలన ఆరోపణలు
తెలంగాణకు చెందిన నీటివనరులపై గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. గోదావరి మిగులు జలాలను రాయలసీమకు మళ్లించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం కావడంతో, రాష్ట్రానికి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీలు ఈ విషయంలో ఏకమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.
Indiramma Houses: కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై తగిన చర్యలు తీసుకోకపోతే, న్యాయపరంగా కోర్టుల శరణు కూడా తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ ప్రజల హక్కులు, నీటి అవసరాల విషయంలో రాజీ పడబోమని స్పష్టంగా హెచ్చరించారు. నేడు జరిగే సమావేశంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కీలకం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే దిశగా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.