Site icon HashtagU Telugu

Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..మల్లికార్జున ఖర్గేకు పరామర్శ

CM Revanth Reddy meet with KC Venugopal

CM Revanth Reddy meet with KC Venugopal

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ఈ రోజు (మంగళవారం) ఉదయం లోక్‌సభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి, కేసీ వేణుగోపాల్‌ తో సమావేశమయ్యారు. ఢిల్లీలోని వేణుగోపాల్ నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది. ఇక ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, సంస్థాగత వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ కార్యవర్గంపైన కూడా మాట్లాడుకుంటారని సమాచారం.

Read Also: Nandyala : నంద్యాలలో పట్టాలు తప్పిన రైలు.. ఏమైందంటే..

ఈ భేటీ అనంతరం కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఖర్గేతో పాటు పార్టీ అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది.

కాగా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా దసరాలోపు మంత్రి వర్గాన్ని చేపట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేబినెట్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలా అని ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి పయనమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నేతల్లో కూడా మంత్రి పదవుల కోసం పోటీ మొదలైంది. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందోనని నేతల్లో ఉత్కంఠ నెలకొంది. దసరా (అక్టోబర్ 12) కు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also: Indian Soldiers : లెబనాన్‌ బార్డర్‌లో 600 మంది భారత సైనికులు.. వాట్స్ నెక్ట్స్ ?