Site icon HashtagU Telugu

CM Kejriwal: కేజ్రీవాల్ ఆరోగ్యంపై తీహార్ జైలు క్లారిటీ ఇదే..

CM Kejriwal

CM Kejriwal

CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్యంపై స్పష్టతా ఇచ్చారు. కేజ్రీవాల్ ఆరోగ్యంపై వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని, అతని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. బరువు తగ్గాడన్న అసత్య ప్రచారాన్ని వారు ఖండించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బరువుపై రాజకీయంగా తీవ్ర కలకలం రేగుతోంది. ఒకవైపు ఢిల్లీ సీఎం అరెస్టు తర్వాత ఆయన బరువు వేగంగా తగ్గుతోందని ఆప్ నేత అతిషి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తీహార్ అడ్మినిస్ట్రేషన్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. సీఎం ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చింది. ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగానే ఉందని అధికార యంత్రాంగం తన పత్రికా ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 1న సిఎం కేజ్రీవాల్ జైలుకు వచ్చినప్పుడు ఇద్దరు వైద్యులు ఆయనను పరీక్షించారని, ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని తీహార్ జైలు అధికారులు చెప్పారు. జైలుకు వచ్చినప్పటి నుంచి అతని బరువు 65 కేజీలుగా ఉందని జైలు అధికారులు తెలిపారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు వారికి ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే అందజేస్తున్నారు.

We’re now on WhatsAppClick to Join.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ లో ఉన్నారు. కేజ్రీవాల్ వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు, అయితే వారి పేర్లు తప్పనిసరిగా జైలు భద్రత దృవీకరించాలి. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌కు సాధారణ ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు.జైలులో వార్తలను తెలుసుకునేందుకు టీవీ సౌకర్యాన్ని కల్పించారు. వార్తలు, వినోదం మరియు క్రీడల కోసం 18 నుండి 20 ఛానెల్‌లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: apple : కేంద్రం వార్నింగ్.. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ యూజర్లకు ‘హై రిస్క్’