Site icon HashtagU Telugu

Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం

Aadhaar Card Applicants New Condition Cm Himanta Biswa Sarma

Aadhaar Card Applicants New Condition : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ శనివారం కీలక ప్రకటన చేశారు. కొత్తగా ఆధార్ కార్డుల కోసం అప్లై చేసే వాళ్లంతా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) రసీదు నంబరును తప్పకుండా అందించాలని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే కొత్త ఆధార్ కార్డుల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉందని.. అనుమానాస్పద పౌరులు ఉన్నారనేందుకు ఇదే పెద్ద సంకేతమని సీఎం పేర్కొన్నారు.

Also Read :Deepika Padukone Admitted To Hospital: ఆసుపత్రిలో చేరిన దీపికా పదుకొనే

అందుకే కొత్తగా ఆధార్ కార్డుకు(Aadhaar Card Applicants New Condition) అప్లై చేసే వారి నుంచి ఎన్‌ఆర్సీ రసీదు నంబరును అడుగుతున్నామని హిమంత బిస్వశర్మ చెప్పారు. దీనివల్ల అసోంలోకి విదేశీయుల అక్రమ ప్రవాహానికి అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై తమ ప్రభుత్వం చాాలా కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. అసోంలో ఆధార్ కార్డును పొందడం ఇక అంత ఈజీగా ఉండబోదని తేల్చి చెప్పారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) ప్రక్రియలో బయోమెట్రిక్ లాక్ అయిన 9.55 లక్షల మంది కొత్త ఆధార్ కార్డులకు అప్లై చేసేటప్పుడు ఎన్ఆర్సీ రసీదు నంబరును సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీ రసీదు నంబరు లేకున్నా వాళ్లందరికీ ఆధార్ కార్డులు వస్తాయన్నారు.

Also Read :Niharika : బాబాయ్ బాటలో కూతురు.. బుడమేరు ముంపు గ్రామాలకు నిహారిక సాయం..

గత రెండు నెలల్లో పలువురు బంగ్లాదేశీయులు అసోంలోకి చొరబడేందుకు యత్నించారని సీఎం హిమంత తెలిపారు. వారిని సరిహద్దుల్లోనే పట్టుకుని పొరుగు దేశ అధికారులకు అప్పగించామన్నారు. అసోంలో జనాభా మార్పుల అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని  ఆగస్టు 28న అసోం సీఎం సంచలన ప్రకటన చేశారు. హిందూ మెజారిటీ ఉన్న అసోంలో ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతోందని అప్పట్లో ఆయన చెప్పారు.

Also Read :Hyundai Venue With Sunroof: త‌క్కువ ధ‌ర‌కే సన్‌రూఫ్‌తో వ‌చ్చిన‌ హ్యుందాయ్ వెన్యూ.. ప్రైస్ ఎంతంటే..?