Clash In Court : కోర్టులో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జి.. వీడియో వైరల్

పోలీసుల లాఠీఛార్జీపై న్యాయవాదులు(Clash In Court) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Clash In Court Ghaziabad Lawyers Judge

Clash In Court : బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఒక కేసు విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు ఏకంగా జిల్లా కోర్టు జడ్జితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో కోర్టులో ఉద్రిక్తత ఏర్పడింది. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో  న్యాయమూర్తుల ఆదేశం మేరకు పోలీసులు వచ్చి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఈక్రమంలో గొడవను కంట్రోల్‌లోకి తెచ్చేందుకు కోర్టు రూంలో పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది. దీంతో పలువురు న్యాయవాదులు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో చోటుచేసుకుంది.

Also Read :Jio Payment : ‘జియో’ మరో కొత్త వ్యాపారం.. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ అగ్రిగేటర్‌గా లైసెన్స్

పోలీసుల లాఠీఛార్జీపై న్యాయవాదులు(Clash In Court) ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు గదిలో లాయర్లపై పోలీసుల లాఠీఛార్జీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోర్టు రూంలో లాయర్లను 20 నుంచి 35 మంది పోలీసులు కొడుతుండటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.  కోర్టు హాలులో ఉన్న కుర్చీలపై నుంచి లేపి మరీ న్యాయవాదులను పోలీసులు కొట్టే సీన్లు వీడియోలో ఉండటం గమనార్హం. దీనిపై చర్చించడానికి బార్ అసోసియేషన్ న్యాయవాదులు సమావేశానికి పిలుపునిచ్చారు. సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణను లాయర్లు ప్రకటించనున్నారు. మరోవైపు ఈ ఘటనకు నిరసనగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు కూడా విధులను బహిష్కరించారు. కోర్టు రూంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Also Read :Operation ASAN : మేడ్ ఇన్ మెదక్.. ‘బీఎంపీ-2 శరత్‌’‌తో ఉగ్రవాదుల ఏరివేత సక్సెస్

  Last Updated: 29 Oct 2024, 03:41 PM IST