Civils Toppers: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2024 ఫలితాలపై అంతటా చర్చ జరుగుతోంది. ఈసారి ఫలితాల్లో మహిళామణులు సత్తా చాటారు. టాప్ – 25 ర్యాంకుల్లో 11 ర్యాంకులను వనితలే కైవసం చేసుకున్నారు. నంబర్ 1 ర్యాంకర్‌గా శక్తి దూబే నిలిచారు. నంబర్ 2 స్థానం హర్షిత గోయల్, నంబర్ 4 స్థానం షా మార్గి చిరాగ్ కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టాప్ 5 ర్యాంకర్ల వివరాలను మనం తెలుసుకుందాం..
Also Read :Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
నంబర్ 1
- శక్తి దూబే సివిల్స్‌లో నంబర్ 1 ర్యాంకు సాధించారు.
- ఆమె ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందినవారు.
- అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బయో కెమిస్ట్రీలో డిగ్రీ పొందారు.
- బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు.
- 2018 నుంచి ఆమె సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు.
- సివిల్స్ మెయిన్స్ పరీక్షలో శక్తి దూబే(Civils Toppers) పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
నంబర్ 2
- హర్షిత గోయల్ సివిల్స్‌లో నంబర్ 2 ర్యాంకు సాధించారు.
- ఆమె హర్యానా వాస్తవ్యురాలు. అయితే వారి కుటుంబం చాలా ఏళ్లుగా గుజరాత్‌లోని వడోదరలో నివసిస్తోంది.
- హర్షిత ప్రొఫెషనల్ రీత్యా సీఏ.
- బరోడా యూనివర్సిటీలో బీ.కాం చేశారు.
- ఆమె సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
నంబర్ 3
- అర్చిత్ పరాగ్ డోంగ్రే సివిల్స్‌లో నంబర్ 3 ర్యాంకు సాధించారు.
- ఆయన పాఠశాల విద్య నుంచి ఇంటర్ వరకు మహారాష్ట్రలో జరిగింది.
- తమిళనాడులో ఉన్న వేలూర్ వీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేశారు.
- సివిల్స్‌లో ఫిలాసఫీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
- 2023లోనూ అర్చిత్ సివిల్స్ పరీక్ష రాయగా.. 153వ ర్యాంకు వచ్చింది. అయితే అంతకంటే బెటర్ ర్యాంకును అర్చిత్ కోరుకున్నారు. ఈసారి ఫలితాల్లో సాధించారు.
Also Read :KTR : నర్సింగ్‌లాంటి కార్యకర్తలుంటే కాంగ్రెస్ కుట్రలు సాగవు : కేటీఆర్
నంబర్ 4
- మార్గి చిరాగ్ షా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వాస్తవ్యురాలు.
- ఆమె ఈసారి సివిల్స్ ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించింది.
- ఆమె విద్యాభ్యాసం అంతా గుజరాత్‌లోనే జరిగింది.
- కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు.
- సివిల్స్‌లో సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
- ఈమె వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు. గత నాలుగేళ్లుగా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది.
- ఇంతకుముందు ఆమె UPSCకి ఇంటర్వ్యూ ఇచ్చింది. కానీ ఎంపిక కాలేదు.
- అయినా పట్టుదలతో కృషి చేసి.. ఈసారి ఫలితాల్లో మార్గి చిరాగ్ షా సత్తా చాటుకుంది.
నంబర్ 5
- ఆకాశ్ గార్గ్ ఈసారి సివిల్స్ ఫలితాల్లో 5వ ర్యాంకు సాధించారు.
- ఈయన ఢిల్లీలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
- ఆకాశ్ ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు.
- సివిల్స్ మెయిన్స్ పరీక్షలో సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు.
- ఆకాశ్ తండ్రి ఉత్తరాఖండ్‌లో టూరిజం బిజినెస్ చేస్తుంటారు.
- ఓ వైపు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూనే, మరోవైపు వ్యాపారంలో తన తండ్రికి ఆకాశ్ హెల్ప్ చేశారు.