China In Doklam : ఓ వైపు భారత్‌తో స్నేహం చేస్తున్న చైనా.. మరోవైపు భూటాన్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ చిన్న దేశంలో యథేచ్ఛగా దురాక్రమణను కొనసాగిస్తోంది. డోక్లాం అనేది భూటాన్ భూభాగం. ఇది భారతదేశంలోని సిక్కిం రాష్ట్రానికి సమీపంలోనే ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా భారతదేశానికి డోక్లాం కీలకమైన పాయింట్. అలాంటి డోక్లాం ప్రాంతానికి సమీపంలో 2020 సంవత్సరం నుంచి ఇప్పటివరకు చైనా 8 గ్రామాలను నిర్మించిందట. తాజాగా తీసిన శాటిలైట్ ఫొటోలతో ఈవిషయం స్పష్టమైంది. ఈ 8 గ్రామాలు కూడా చైనా సైనిక స్థావరాలకు సమీపంలోనే ఉండటం గమనార్హం.2016 నుంచి 2020 సంవత్సరం మధ్యకాలంలో మరో 14 గ్రామాలను కూడా డోక్లాం(China In Doklam) సమీపంలో చైనా కట్టించింది. అంటే గత ఎనిమిదేళ్లలో మొత్తం 22 చైనా గ్రామాలు డోక్లాం సమీపంలో వెలిశాయి. మొత్తం మీద ఆ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నాల్లో చైనా ఉందనేది విస్పష్టం.
Also Read :Diabetic Retinopathy : పెరుగుతున్న డయాబెటిక్ రెటీనోపతి కేసులు.. ఏమిటీ వ్యాధి ?
సిలిగురి కారిడార్ అనేది ఈశాన్య భారతదేశంలో 8 రాష్ట్రాల రైలు, రోడ్డు రవాణా మార్గాలకు వెన్నెముక లాంటిది. ఒకవేళ భూటాన్‌లోని డోక్లాంలో చైనాకు పట్టు పెరిగితే.. అది సిలిగురి కారిడార్‌కు ముప్పును తెస్తుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు పైప్‌లైన్లు, కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా ఇదే మార్గంలో వెళ్తాయి. సిలిగురి కారిడార్‌కు చాలా దగ్గరలో చైనాకు చెందిన చుంబీ లోయ ఉంది.
Also Read :New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ
సిలిగురి కారిడార్‌పై చైనా దాడి చేస్తే..
ఒకవేళ సిలిగురి కారిడార్‌పై చైనా దాడి చేస్తే.. భారత్‌లోని ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు లింక్ కట్ అవుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అదే జరిగితే ఈశాన్య రాష్ట్రాలకు సైన్యం తరలింపు, ఆయుధాల తరలింపు కష్టతరంగా మారుతుంది. అందుకే భూటాన్‌లోని డోక్లాంలో చైనా పట్టు పెరగడాన్ని భారత్ మొదటినుంచీ వ్యతిరేకిస్తోంది. ఈవిషయంలో భారత్-చైనా సైన్యాల మధ్య 2017లో 72 రోజుల పాటు ప్రతిష్టంభన నడిచింది. అప్పట్లో దౌత్యపరమైన చర్యలతో సమస్య పరిష్కారమైంది. అయినా డోక్లాంలో చైనా యాక్టివిటీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం చైనాకు భారత్ చేరువైంది. ఈ తరునంలో డోక్లాం వ్యవహారంలోకి తలదూర్చకపోవచ్చని అంచనా వేస్తున్నారు.