Acid Attack: మరో యువతితో ప్రియుడు పెళ్లి.. అబ్బాయిలా వచ్చి యాసిడ్ దాడి చేసిన ప్రియురాలు అరెస్ట్..!

వధూవరులపై యాసిడ్ దాడి (Acid Attack) చేసిన ప్రియురాలిని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బస్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో అమర్చిన పన్నెండు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు యువతిని గుర్తించారు.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 09:39 AM IST

వధూవరులపై యాసిడ్ దాడి (Acid Attack) చేసిన ప్రియురాలిని ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) బస్తర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో అమర్చిన పన్నెండు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు యువతిని గుర్తించారు. ప్రస్తుతం నిందితురాలైన ప్రియురాలిని పోలీసులు జైలుకు పంపారు. విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసు భాన్‌పురి ప్రాంతంలోని అమబల్ గ్రామానికి సంబంధించినది.

పోలీసుల విచారణలో 23 ఏళ్ల నిందితురాలు తనకు పదేళ్ల క్రితం దమ్రు బాఘేల్ అనే యువకుడిని కలిసినట్లు చెప్పింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దమ్రు కూడా ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో బాఘేల్ ప్రియురాలిని దూరం పెట్టాడు. ఈ క్రమంలో మరో యువతితో అతడికి పెళ్లి నిశ్చయమైంది.

Also Read: Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. 24 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

తనను దూరం పెట్టి మరో యువతిని పెళ్లి చేసుకోవడం ప్రియురాలు తట్టుకోలేకపోయింది. బాఘేల్ ని చంపి పగ తీర్చుకోవాలని అనుకుంది. అబ్బాయిలా వేషం మార్చుకుని యాసిడ్ సీసాతో ప్రియుడి పెళ్లి జరుగుతున్న మండపానికి చేరుకుంది. సమయం చూసి పీటలపై కూర్చున్న వధూవరులపై యాసిడ్ సీసాతో దాడి చేసింది. దింతో మండపంలో మంటలు చెలరేగాయి. యాసిడ్ పడడంతో మరో పదిమంది కూడా గాయపడ్డారు. కరెంటు పోవడంతో ఇదే అదునుగా భావించిన నిందితురాలు అక్కడి నుంచి పరారైంది.

ఈ సందర్భంగా ఏఎస్పీ నవోదితా పాల్ మాట్లాడుతూ.. అమాబాల్‌లో వధూవరులపై యాసిడ్ దాడి అనంతరం సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశామని, దీంతో పాటు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారని గ్రామానికి చెందిన కొందరు తెలిపారు. ఘటన అనంతరం ప్యాంట్‌ షర్టు ధరించిన ఓ యువకుడు పారిపోయాడు. పోలీసులు కూడా ఓ ఇన్‌ఫార్మర్‌ని నిమగ్నం చేయగా, నిందితుడు యువకుడు కాదని యువతి అని తెలిసింది.దీంతో పోలీసులు ఆ యువతిని గుర్తించి అరెస్ట్ చేశారు.