Maoists Surrender Policy : ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మావోయిస్టుల వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో వందలాది మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ఏరియాల్లో భద్రతా బలగాలు, పోలీసులతో కూడిన సంయుక్త టీమ్స్ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అడవులను జల్లెడ పడుతూ మావోయిస్టులను ఏరిపారేస్తున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు చోటు లేకుండా చూస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే అక్కడి బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లతో ముందుకుసాగుతోంది. అయితే ఇప్పుడు ఒక కొత్త అప్‌డేట్ బయటికి వచ్చింది. ఆ వివరాలను తెలుసుకుందాం..
Also Read :US Navy Seals : చైనాకు షాక్.. తైవాన్ ఆర్మీకి అమెరికా నేవీ సీల్స్ ట్రైనింగ్
మరో రెండు నెలల్లో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన కొత్త పాలసీని తీసుకొచ్చే అంశంపై ఛత్తీస్‌గఢ్ సర్కారు (Maoists Surrender Policy) ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వాటిని మూడేళ్ల పాటు కొనసాగించనున్నారు. తద్వారా ఆయా ఏరియాల్లోని యువతను స్వయం ఉపాధి పొందేలా సిద్ధం చేయనున్నారు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రతినెలా రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. మూడేళ్ల పాటు ఆ సాయం అందుతుంది.
Also Read :Kandahar Hijack : బీజేపీ ఉగ్రవాదులను వదిలేయబట్టే.. దేశం ఉగ్రదాడులను ఎదుర్కొంది : ఫరూక్ అబ్దుల్లా
లొంగిపోయే మావోయిస్టులు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకొని స్వయం ఉపాధిని పొందొచ్చు. కుండలు చేయడం, సెలూన్ వర్క్, కమ్మరి పని, వెల్డింగ్ వర్క్ వంటివి ఈ సెంటర్లలో నేర్పిస్తారు. లొంగిపోయే మావోయిస్టుల్లో పెద్ద క్యాడర్ వారికి వెంటనే రూ.5 లక్షల సాయాన్ని అందిస్తారు. మావోయిస్టుల రాష్ట్ర కమిటీ, ప్రాంతీయ కమిటీ, సెంట్రల్ కమిటీ, పొలిట్ బ్యూరో వారికి రూ.2.50 లక్షలు చొప్పున సాయం అందిస్తారు.