Site icon HashtagU Telugu

New AICC Office : ఇందిరా భవన్ పేరును ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా మార్చండి – BJP

Cng New Office

Cng New Office

కాంగ్రెస్ కొత్త హెడాఫీస్ ఇందిరా భవన్ పేరును ‘సర్దార్ మన్మోహన్ సింగ్ భవన్’గా మార్చాలని BJP సూచించింది. ఆయనకు సముచిత గౌరవం కల్పించాలంది. ఆఫీస్ బయట MMS పేరుతో వెలిసిన పోస్టర్లు, ఫ్లెక్సీలపై స్పందించింది. ‘ఓసారి మన్మోహను రాహుల్ తన మెంటార్గా చెప్పారు. ఆయన మరణంతో దేశం సంతాప దినాలు జరుపుకుంటున్నా న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్లారు. ఇలాగైనా MMSను గౌరవించండి’ అని BJP నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.

ఇక బుధువారం డిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి (New AICC Office) సంబంధించిన కొత్త భవనాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యాలయానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.

Three Warships Commissioned : ‘‘వికాసం కావాలి.. విస్తరణ కాదు’’.. మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితమిచ్చిన మోడీ

ఇందిరాగాంధీ భవన్ 1978 నుంచి అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయానికి భిన్నంగా, 9A కోట్లా రోడ్డులో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ భవనంలో ఆరు అంతస్తులు ఉండి, రాజకీయ కార్యకలాపాలకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీనివల్ల పార్టీ కార్యాచరణకు మరింత సమర్థత మరియు సౌలభ్యం లభించనుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ అఖిల భారత కార్యాలయానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. కొత్త కార్యాలయం ప్రారంభం, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మరింత శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తుంది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం.. కాంగ్రెస్ పార్టీకి తిరిగి పుంజుకోవడం కోసం కీలకమైన దశగా భావిస్తున్నారు. ఇక్కడి నుండి జాతీయ, రాష్ట్ర స్థాయి వ్యూహాలను అభివృద్ధి చేయడం, ప్రణాళికలు అమలు చేయడం కొనసాగుతుంది.