Site icon HashtagU Telugu

Chandrayaan 4 : చంద్రయాన్‌-4కు కేంద్రం పచ్చజెండా.. ఈసారి ఏం చేస్తారంటే.. ?

Chandrayaan 4 Moon Lunar Soil Rocks

Chandrayaan 4 : చంద్రయాన్‌-4 మిషన్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా చంద్రుడిపై నుంచి భూమికి చంద్ర శిలలు, మట్టిని తీసుకురానున్నారు. ఈవివరాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి  అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. వీనస్ ఆర్బిటర్‌ మిషన్‌, గగన్‌యాన్‌ విస్తరణకు సైతం కేంద్ర సర్కారు(Chandrayaan 4) ఆమోదం తెెలిపింది. లో ఎర్త్ ఆర్బిట్‌లో 30 టన్నుల పేలోడ్‌లను ఉంచేందుకు నెక్ట్స్‌ జనరేషన్ లాంఛ్‌ వెహికల్‌ను ప్రయోగించడానికి క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది.

Also Read :Rahul Gandhi : రాహుల్‌‌గాంధీ హత్యకు కుట్రపన్నారు.. పోలీసులకు కాంగ్రెస్ కంప్లయింట్

వచ్చే 36 నెలల్లోగా.. 

చంద్రయాన్‌-4 మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.2,104.06 కోట్లను కేటాయించింది. భారత వ్యోమగాములను చంద్రుడిపై దించడం, వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకు రావడం అనేది ఈ మిషన్ ప్రధాన లక్ష్యం.  ఇందుకు అవసరమైన స్పేస్ క్రాఫ్ట్‌ల అభివృద్ధి, వాటితో ముడిపడిన ప్రయోగాలను ఇస్రో నిర్వహించనుంది.  ఈక్రమంలో పరిశ్రమలు, అత్యున్నత విద్యాసంస్థల సహకారాన్ని ఇస్రో తీసుకోనుంది. వచ్చే 36 నెలల్లోగా ఈ మిషన్‌ను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

వీనస్ ఆర్బిటర్ మిషన్

వీనస్ ఆర్బిటర్‌ మిషన్‌కు కేంద్ర సర్కారు పచ్చజెండా ఊపింది. దీని ద్వారా శుక్ర గ్రహాన్ని స్టడీ చేస్తారు. ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఒక స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించారు. ఈ ప్రాజెక్టును చేపట్టడానికి రూ.1,236 కోట్లు కేటాయించారు. స్పేస్ క్రాఫ్ట్ తయారీకి రూ.824 కోట్లు వెచ్చించనున్నారు. దీనిపై ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్‌’ ఏర్పాటు చేసే లక్ష్యం దిశగా అడుగులు వేస్తామని ఆయన వెల్లడించారు. మొదట్లో తమకు గగన్‌యాన్‌ లక్ష్యంగా ఒక్కటే ఉండేదని.. ఇప్పుడు తమకు ఐదు మిషన్‌లు ఉన్నాయని తెలిపారు. ఇస్రో పరిధిలో చాలా విస్తరించిందని చెప్పారు. ఇక ఇవాళ కేంద్ర క్యాబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీలు, ఐఐఎంల తరహాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమర్సివ్‌ క్రియేటర్స్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Also Read :Dead Butt Syndrome: డెడ్ బట్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ల‌క్ష‌ణాలివే..!