Site icon HashtagU Telugu

Chandrayaan-3 Controversy: పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న చంద్రయాన్-3

Chandrayaan-3

New Web Story Copy (97)

Chandrayaan-3 Controversy: ఎట్టకేలకు భారత్ అడుగు చంద్రునిపై పడింది. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్‌ సరికొత్త చరిత్రను లిఖించింది. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై విజయవంతంగా ల్యాండ్ అయిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అయితే విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టిన ప్రదేశానికి భారత ప్రభుత్వం శివశక్తి పాయింట్ పేరుతో నామకరణం చేసింది. దీంతో వివాదం చెలరేగింది. .

చంద్రునిపై విక్రమ్ ల్యాండర్ టచ్‌డౌన్ స్పాట్‌కు ‘శివశక్తి పాయింట్’ అని పేరు పెట్టడం వెనుక మతపరమైన ఆలోచన ఉందని భారతీయ జనతా పార్టీపై సమాజ్‌వాదీ పార్టీ ఆరోపణలు చేస్తుంది. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ సంభాల్ షఫీకర్ రెహ్మాన్ బార్క్ శనివారం ఈ తరహా కామెంట్స్ చేయడంతో చంద్రయాన్ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ ప్రదేశానికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాల్సి ఉందన్నారు. అబ్దుల్ కలాం ఒక శాస్త్రవేత్త, అంతరిక్ష ప్రయోగాలకు ఆయనే పునాది వేశారు కాబట్టి దీనికి పేరు పెట్టాల్సి వస్తే.. అతని పేరు మాత్రమే పెట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రయాన్ ప్రయోగం అనేది దేశ విజయానికి ప్రతీక అని, దీనికి హిందూ-ముస్లిం రంగు వేయకూడదు అంటూ ఎంపీ బార్క్ మండిపడ్డారు.

చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌక దిగిన ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మోడీ ప్రకటించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ స్పాట్‌కు ‘శివశక్తి పాయింట్’ అని, చంద్రయాన్-2 ల్యాండర్ క్రాష్ అయిన ప్రదేశానికి ‘తిరంగా పాయింట్’ అని నామకరణం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

Also Read: Today Miracle In Space : ఇవాళ రాత్రి శనిగ్రహాన్ని చూసే ఛాన్స్.. ఎలా చూడాలో తెలుసా ?