Ayodhya : అయోధ్య కు బయలుదేరుతున్న చంద్రబాబు , పవన్ కళ్యాణ్

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ […]

Published By: HashtagU Telugu Desk
Pawan Babu Ayodya

Pawan Babu Ayodya

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి కొద్దీ గంటల సమయం మాత్రమే ఉంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మోడీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ వేడుకను చూసేందుకు దేశ నలుమూల నుండి పెద్ద ఎత్తున భక్తులు , రాజకీయ నేతలు , బిజినెస్ రంగ ప్రముఖులు , క్రీడాకారులు , సినీ తారలు ఇలా అన్ని రంగాల వారు భారీ సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అతిధుల కోసం అన్ని ఏర్పాట్లు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు అయోధ్య కు బయలుదేరబోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అయోధ్యకు వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి.. సోమవారం రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు హాజరవుతారు. ఇద్దరు నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతుండడంతో బీజేపీతో పొత్తులపై రాజకీయ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. ఇక చంద్రబాబు అయోధ్య కు వెళ్తుండడంతో ఈనెల 25న కర్నూలు జిల్లా పత్తికొండలోజరగబోయే ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా పడింది. ఈనెల 27 లేదా 28 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఓ భక్తుడు భారీ లడ్డూను అయోధ్యకు పంపించారు. సిటీలోని శ్రీరామ్ క్యాట‌రింగ్ స‌ర్వీసెస్ ఓన‌ర్ ఎన్ నాగ‌భూష‌ణం రెడ్డి త‌యారు చేసిన భారీ ల‌డ్డూ(Laddoo) ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బ‌రువు ఉన్న ఆ ల‌డ్డూ క‌ర‌సేవ‌క్‌పురంకు చేరుకున్నట్లు ఆయ‌న తెలిపారు. అదేవిధంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కూడా లక్ష లడ్డూలను అయోధ్యకు చేరాయి.

Read Also : YSRCP : వైసీపీ ఐదో జాబితాపై కొన‌సాగుతున్న క‌స‌ర‌త్తు.. ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న నేత‌లు

  Last Updated: 21 Jan 2024, 10:12 AM IST