Site icon HashtagU Telugu

Chandigarh : బాలికల హాస్టల్లో స్నానం చేస్తున్న విద్యార్థినుల వీడియోలు లీక్.. 8 మంది ఆత్మహత్య యత్నం.!!

University

University

పంజాబ్ మొహాలీలోని చండీగఢ్ యూనివర్శిటీలో ఘోరం జరిగింది. గర్ల్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థిని 60 మంది విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసి ఓ యువకుడికి పంపింది. ఆ యువకుడు ఆ వీడియోను ఇంటర్నెట్ మీడియాలో వైరల్ చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ కావడంతో ఎనిమిది మంది విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా కయాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు శనివారం అర్థరాత్రి చండీగఢ్ యూనివర్సిటీని చుట్టుముట్టి ‘వి ఫర్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. యూనివర్సిటీ చేరుకున్న పోలీసులను చూసి విద్యార్థులు ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఇంత జరిగినా యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడంలేదని విద్యార్థులు నిలదీశారు. విషయం సున్నితమైంది కావడంతో పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. మరోవైపు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version