Champai Soren : జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ సీఎం, జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత చంపై సోరెన్ ఒక సంచలనంగా మారారు. ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఇవాళ ఉదయాన్నే చంపై సోరెన్ (Champai Soren) రాంచీ నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు ఆరుగురు జేఎంఎం ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లినట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
చంపై సోరెన్ .. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ఈ ఏడాది జనవరి 31న హేమంత్ సోరెన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆ వెంటనే జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు. తమకు అత్యంత విశ్వసనీయుడిగా భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు. హేమంత్ సోరెన్ బెయిలుపై జైలు నుంచి విడుదలయ్యాక జులై 3న సీఎం పదవికి చంపై సోరెన్ రాజీనామా చేశారు.
Also Read :Orphan Girl Gangraped : ఆగి ఉన్న బస్సులో అనాథపై గ్యాంగ్‌రేప్
అయితే తనను ఏమాత్రం గౌరవించకుండా అకస్మాత్తుగా సీఎం పదవి నుంచి తొలగించడంపై చంపై సోరెన్ ఆగ్రహంగా ఉన్నారు. జేఎంఎం ప్రభుత్వాన్ని కష్ట కాలంలో నడిపినందుకు తనకు ఏమాత్రం కనీస గౌరవం లభించలేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారట. జేఎంఎంలో తన లాంటి సీనియర్లకు విలువ లేకుండా పోయిందని చంపై సోరెన్ భావిస్తున్నారట. అయితే చంపై సోరెన్ వెంట వెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేలను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ సీనియర్ నేతలు కాంటాక్ట్ చేసేందుకు యత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. దీంతో నెక్ట్స్ ఏం జరగబోతోంది ? చంపై సోరెన్ ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారా ? అనే సందేహాలు బలపడుతున్నాయి. శనివారం రాత్రి కోల్‌కతాకు వెళ్లిన చంపై సోరెన్ అక్కడ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారితో భేటీ అయ్యారు. దీన్నిబట్టి తాను బీజేపీకి చేరువ కాబోతున్నాననే సంకేతాలను పంపారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో చంపై సోరెన్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని శనివారం రోజు చంపై సోరెన్ ఖండించారు. తాను ఎక్కడున్నానో.. అక్కడే ఉన్నాను కదా అని ఆయన వ్యాఖ్యానించారు.