ప్రధాని మోడీ (PM Modi) కీలక ప్రకటన చేసారు. మరో ఐదేళ్ల పాటు రేషన్ దారులకు ఉచిత రేషన్ (Free Ration Scheme ) అందజేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ తో పాటు మరో నాల్గు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ ..మరో ఐదేళ్ల పాటు ఉచితంగా రేషన్ అందజేయనున్నట్లు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని దుర్గ్‌లో ప్రకటించారు.
ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ ..జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం దేశంలోని 80 కోట్ల మంది (80 crore people )కి కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్‌ను అందజేస్తుంది. డిసెంబర్ 2022లో ఈ పథకం ఒక సంవత్సరం పాటు పొడిగించబడింది. ఈ పథకం వల్ల కేంద్ర ప్రభుత్వంపై ఏటా రూ.2 లక్షల కోట్ల అదనపు భారం పడుతోంది. పేదలు రేషన్ కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ (Congress ) ఫై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఎప్పుడూ పేదలను మోసం చేయడం తప్ప మంచి చేసింది లేదన్నారు. పేదల బాధలు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోడని , అందుకే అధికారంలో ఉన్నంత కాలం పేదల హక్కులను దోచుకుని తిని నాయకులంతా తమ ఖజానాను నింపుకున్నారని మండిపడ్డారు. 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని , పేదరికం నుంచి బయటపడిన వారే నేడు మోదీకి కోట్లాది దీవెనలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఎంతో ఓర్పు, నిజాయితీతో పని చేస్తున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా పేదలకు ఉచిత రేషన్ అందేలా బీజేపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, అందుకే వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్ సౌకర్యం కల్పించామన్నారు.
Read Also : Mukesh Ambani Threat Mails: అంబానీకి మరో బెదిరింపు మెయిల్.. ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్..!