కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Gadkari) కీలక ప్రకటన చేశారు. రానున్న రెండు సంవత్సరాలలో భారత్‌లో రహదారుల అభివృద్ధికి రూ.10 లక్షల కోట్ల భారీ బడ్జెట్(Rs .10 lakh crore investment to rewire highways)ను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. దేశంలోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో రోడ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అమెరికా తరహాలో హై క్వాలిటీ రోడ్లు నిర్మించి భారత రహదారులను ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కేంద్రం కృషి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Vanajeevi Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వనజీవి అంత్యక్రియలు
2014లో జాతీయ రహదారుల పొడవు 91,287 కిలోమీటర్లుగా ఉండగా, ప్రస్తుతం ఇది 1,46,204 కిలోమీటర్లకు పెరిగిందని వివరించారు. ఇది మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేంద్రం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని చెప్పారు. రహదారుల అభివృద్ధితో పాటు, టన్నెల్స్, ఫ్లైఓవర్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఇది రవాణా వేగాన్ని పెంచడమే కాకుండా, ఆర్థికంగా కూడా దేశ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. భారత రహదారుల నాణ్యతకు గ్లోబల్ ప్రమాణాలు తీసుకురావడం ద్వారా రోడ్లలో యాక్సిడెంట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. నిరంతరం పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రహదారులను మరింత విశాలంగా, భద్రతాపరంగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భారత రోడ్లను చూసి ఇతర దేశాలు స్ఫూర్తి పొందేలా అభివృద్ధి చేస్తామనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.