No Detention Policy : వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో కంటిన్యూ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. పాఠశాల విద్యకు సంబంధించిన నో డిటెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే.. పైతరగతులకు ప్రమోట్ కారు. అలా జరిగితే.. వారు మళ్లీ ప్రిపేరై పరీక్ష రాసేందుకు కొంత టైంను కేటాయిస్తారు. వార్షిక పరీక్షల ఫలితా లు విడుదలైన తేదీకి.. రెండు నెలల్లోపే ఇంకోసారి వార్షిక సప్లిమెంటరీ పరీక్షను నిర్వహిస్తారు. రెండోసారి జరిగే వార్షిక పరీక్షలో కూడా 5, 8 తరగతుల విద్యార్థులు ఫెయిల్ అయితే.. అవే తరగతుల్లో మళ్లీ కొనసాగాలి. అయితే ప్రాథమికోన్నత విద్య పూర్తయినంత వరకు ఏ విద్యార్థిని కూడా తరగతి నుంచి బహిష్కరించకూడదని కేంద్రం తేల్చి చెప్పింది. కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం దేశంలోని కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు వర్తించనుంది.
Also Read :Sunny Leone : సన్నీ లియోన్‌కు నెలవారీ ఆర్థికసాయం.. గవర్నమెంట్ స్కీంతో లబ్ధి !?
నూతన విద్యా విధానంలో భాగంగా డిటెన్షన్ విధానం(No Detention Policy) అమలుపై ఇటీవలే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర సర్కారు సేకరించింది. దాని ఆధారంగానే తాజా నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్య అనేది రాష్ట్ర జాబితాలో ఉండే అంశం. అందుకే కేంద్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలుపర్చాలా ? వద్దా ? అనే దానిపై స్వతహాగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఇప్పటికే మన దేశంలోని 16 రాష్ట్రాలు, ఢిల్లీ సహా రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేశారు. హర్యానా, పుదుచ్చేరి దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ‘నో డిటెన్షన్ విధానం’ కొనసాగుతోంది.మొత్తం మీద నో డిటెన్షన్ విధానంపై విద్యారంగ పరిశీలకుల నుంచి ఒక్కో విధమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.