MPs Salary Hike : లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు గుడ్ న్యూస్. ఎందుకంటే వారి శాలరీలు, పింఛన్లను కేంద్ర సర్కారు పెంచింది. ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఎంపీల వేతనాలను 24శాతం పెంచుతూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తాజా మార్పుతో ఒక్కో ఎంపీ వేతనం నెలకు రూ.లక్ష నుంచి రూ.1.24 లక్షలకు పెరగనుంది. సిట్టింగ్ ఎంపీల రోజువారీ భత్యాన్ని రూ.2వేల నుంచి 2,500కు పెంచారు. మాజీ ఎంపీలకు ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్‌ను రూ.25వేల నుంచి రూ.31వేలకు పెంచారు. ఈమేరకు పెంచిన వేతనాలను(MPs Salary Hike) 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేయనున్నారు.
Also Read :Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. శ్రవణ్‌కు సుప్రీంకోర్టులో ఊరట
ఎంపీలకు అందే ప్రయోజనాలివీ..
- నియోజకవర్గ భత్యంగా ప్రతినెలా రూ.70వేలు ఇస్తారు.
- ఆఫీసు భత్యంగా ప్రతినెలా రూ.60వేలు ఇస్తారు.
- సెషన్ అలవెన్సుగా ప్రతిరోజు రూ.2,500 చొప్పున ఇస్తారు.
- ఫోన్, ఇంటర్నెట్ సేవల కోసం వార్షిక భత్యాన్ని ఇస్తారు.
- ఎంపీ, అతడి కుటుంబ సభ్యులు ఉచితంగా ఏటా 34 దేశీయ విమాన ప్రయాణాలు చేయొచ్చు.
- ఎంపీలు అన్ లిమిటెడ్‌గా ఫస్ట్ క్లాస్ రైల్ ట్రావెల్ చేయొచ్చు.
Also Read :Lord Shani: ఇంట్లో శనీశ్వరుని దిశ ఇదే.. పొరపాటున కూడా ఆ దిక్కులో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి!
- ఎంపీలు రోడ్డు ప్రయాణం చేస్తే మైలేజీ అలవెన్సును పొందుతారు.
- ఎంపీలు ప్రతి సంవత్సరం 50వేల యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా వాడుకోవచ్చు.
- ఎంపీలు ఏటా 4వేల కిలో లీటర్ల నీటిని ఉచితంగా పొందొచ్చు.
- పదవీ కాలం ముగిసే వరకు సీనియారిటీ ప్రాతిపదికన ఐదేళ్ల పాటు ఎంపీలకు అద్దె లేకుండానే ఢిల్లీలో నివాస సౌకర్యాన్ని కల్పిస్తారు. కొందరు ఎంపీలకు హాస్టల్స్‌లో వసతి కల్పిస్తారు. ఇంకొందరికి ఫ్లాట్లు కేటాయిస్తారు. మరికొందరికి బంగ్లాలు ఇస్తారు.
- ఎవరైనా ఎంపీలకు ఢిల్లీలో నివాస వసతిని కల్పించలేకపోతే.. వారికి ప్రతినెలా ఇంటి అద్దె భత్యాన్ని చెల్లిస్తారు.