BUDGET: కేంద్ర ప్రభుత్వ ఖర్చుల అంచనాలు

BUDGET: ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాన్ని వివిధ రంగాలకు కేటాయించిందని వెల్లడించింది

Published By: HashtagU Telugu Desk
Budget 2026

Budget 2026

కేంద్ర ప్రభుత్వం (Central Government) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.50.65 లక్షల కోట్ల ఖర్చును అనుమతిస్తూ బడ్జెట్‌(Union Budget 2025)ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాన్ని వివిధ రంగాలకు కేటాయించిందని వెల్లడించింది. దేశ ఆర్థిక పురోగతికి, మౌలిక వసతుల అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కీలకంగా నిలిచేలా ఈ బడ్జెట్ రూపొందించబడింది.

ప్రభుత్వ ఖర్చులో అధిక భాగం వడ్డీలకు కేటాయించబడింది. మొత్తం రూ.12.76 లక్షల కోట్లు వడ్డీల భరణకు కేటాయించబడింది. ఇది గతంతో పోల్చితే పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ రుణ భారం పెరగడం వల్ల వడ్డీ ఖర్చు కూడా అధికమవుతోంది. దీని ప్రభావం ఇతర రంగాలపై పడే అవకాశం ఉంది. రవాణా రంగానికి ప్రభుత్వం రూ.5.48 లక్షల కోట్లు కేటాయించింది. రోడ్లు, రైళ్లు, విమానాశ్రయాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగించబడతాయి. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగడానికి ఈ నిధులు దోహదపడతాయి. రవాణా రంగ అభివృద్ధి వాణిజ్యానికి, పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తుంది.

Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త

రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లు కేటాయించబడింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని సైనిక సదస్సులను మెరుగుపరచడం, సరికొత్త ఆయుధాల కొనుగోలు, సైనిక సిబ్బంది సంక్షేమం వంటి అంశాలకు ఈ నిధులు ఉపయోగించబడతాయి. దేశ రక్షణ మరింత బలోపేతం కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మేజర్ సబ్సిడీలకు రూ.3.83 లక్షల కోట్లు, పెన్షన్లకు రూ.2.76 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు కేటాయించింది. వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ, పేద ప్రజలకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సబ్సిడీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. బడ్జెట్‌లో గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులు గ్రామీణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీంతో సమగ్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  Last Updated: 01 Feb 2025, 03:36 PM IST