Central Cabinet : ప్రధాని మోడీ నేతృత్వంలోని 2025 కొత్త యేడాదిలో కేంద్ర క్యాబినేట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే మొత్తాన్ని రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ఓ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు ముఖ్యమైన ప్రాజెక్టులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త యేడాది డీఏతో పాటు కరువు భత్యం పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో 9 వేల కోట్ల భారం పడనుంది. మరోవైపు గతంలో పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలతో పాటు కొత్త యేడాదిలో అడ్వాన్స్ గా కొంత బకాయిలు చెల్లించబోతున్నట్టు సమాచారం. మొత్తంగా ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా కేబినేట్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక ప్రకటన చేయబోతోందని చెబుతున్నారు. మొత్తం మీద, ఉద్యోగులతో పాటు వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరల అంశం కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత పొందింది.
కాగా, కేంద్ర క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. చిన్న రైతులు ఫసల్ బీమా యోజన ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఫసల్ బీమా పథకాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామన్నారు. రైతుకు ఇస్తున్న పంటల బీమా పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకాన్ని సులభతరం చేసేందుకు, దాని నియమాలు, నిబంధనలను సవరిస్తామన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.69515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. దీని వల్ల 4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇక, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందుకే మొదటి మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.
Read Also: T Congress Incharge : టీ కాంగ్రెస్‌కు కొత్త ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ ? రేసులో ఆ ముగ్గురు !