GST on Electricity Bill : సామాన్యులపై మరో పెను భారం మోపేందుకు కేంద్రం సిద్ధం..?

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 11:37 AM IST

బీజేపీ (BJP) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి సామాన్యులకు (Common Man) వరుస షాకులు ఇస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా GST ని తీసుకొచ్చి ప్రతి వస్తువు ఫై భారం మోపింది. GST దెబ్బకు సామాన్య ప్రజలు ఏ వస్తువు తీసుకోవాలన్న ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. అయినప్పటికీ తప్పకతీసుకొని వెళ్తున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువు ఫై GST వేస్తున్న కేంద్రం..ఇక మరో పెను భారం మోపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

ప్రజల నిత్యవసర వస్తువుల్లో ఒకటైన విద్యుత్‌ఫై జీఎస్టీ విధించేందుకు విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందుకోసం ‘డెలాయిట్‌ ఆడిట్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌’ అనే ప్రైవేట్ సంస్థను ఆశ్రయించింది. విద్యుత్‌ వినియోగదారులపై జీఎస్టీ విధిస్తే వచ్చే లాభనష్టాలెంటో రిపోర్ట్ ఇవ్వాలంటూ కొన్ని రోజుల క్రితం… కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సదరు సంస్థను కోరింది. కేంద్రం ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన ‘డెలాయిట్‌’.. ఇటీవలే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. కరెంటును జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనీ, ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో వ్యతిరేకత ఉండకపోవచ్చని ఆ రిపోర్ట్‌లో తెలిపింది. దీంతో మోడీ సర్కార్.. విద్యుత్ వినియోగదారులపై మరో రెండ్రోజుల్లో కరెంట్ బాంబు వేయడానికి ప్రణాళికలు చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ బిల్లులతో కలిపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ఈడీ) వసూలు చేస్తూ వస్తున్నారు. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా ఉంటుంది. తెలంగాణలో ఎలక్ట్రిసిటీ డ్యూటీ (ED)ని యూనిట్‌కు 6 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు 100 యూనిట్ల కరెంటు వాడితే, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.6 చెల్లించాల్సి ఉంటుంది. కరెంటు బిల్లులో ఎలక్ట్రిసిటీ డ్యూటీ కాలమ్‌ సపరేట్‌గా ఉంటుంది. బిల్లు మొత్తంలో ఈ సొమ్ము కలిసే ఉంటుంది. స్వల్ప మొత్తమే కాబట్టి వినియోగదారులు దీనిపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇప్పుడు కేంద్రం చూపు దీనిపై పడింది. అందుకోసమే డెలాయిట్ సంస్థతో దీనిపై అధ్యయనం చేయించగా… ఈ ‘ED’ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉందని, దీని వల్ల పన్ను వసూళ్లలో హేతుబద్ధత లేకుండా పోతున్నదనీ, దాన్ని క్రమబద్దీకరిస్తూ ‘జీఎస్టీ’ పరిధిలోకి తెస్తే, రాష్ట్రాల వాటా ఆదాయం కూడా పెరుగుతుందని ‘డెలాయిట్‌’ తన నివేదికలో తెలిపింది. మరి దీని ద్వారా సామాన్య ప్రజల ఫై ఏ మేరకు భారం పడుతుందో చూడాలి.

Read Also : PM Modi: ఆయుష్మాన్ కార్డుల సంఖ్య 28 కోట్ల 50 ల‌క్ష‌లు, మోడీ హర్షం