Bihar : బీహార్‌కు ప్రత్యేక హోదాను నిరాకరించిన కేంద్రం

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ)..బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది.

  • Written By:
  • Updated On - July 22, 2024 / 05:02 PM IST

Bihar: బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్‌-యునైటెడ్‌ (జేడీయూ)..బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. ఆర్థికవృద్ధి, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు బీహార్‌తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే ప్రణాళిక ఏదైనా ఉందా..? అని జేడీయూ ఎంపీ రామ్‌ప్రిత్‌ మండల్‌ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను ప్రశ్నించారు. దీనికి ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరీ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్డీయే కూటమిలో జేడీయూ కీలకంగా మారింది. 12 మంది సభ్యుల బలంతో కూటిమిలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. దీంతో ప్రత్యేక హోదా ప్రతిపాదనను తెర పైకి తెచ్చింది. అదే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యం అని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. దానిని ఇవ్వడంలో కేంద్రానికి ఏదైనా సమస్య ఉంటే.. తాము ప్రత్యేక ప్యాకేజీని కోరతామని తెలిపారు. ఇక కేంద్రం నుంచి వచ్చిన స్పందనపై విపక్ష పార్టీ ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. ”కేంద్రంలో అధికారంలో భాగస్వామి అయిన జేడీయూ ఆ ఫలితాలను అనుభవించాలి. ప్రత్యేక హోదాపై వారి నాటకాలను కొనసాగించాలి” అని ఎద్దేవా చేసింది.

ప్రత్యేక కేటగిరీ లేదా హోదాను కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేందుకు ఎన్డీసీ సూచనలు చేసిందన తెలిపింది. ఇందులో 1. కొండలు, క్లిష్టమైన భూభాగం ఉన్న ప్రాంతాలు, 2. తక్కువ జనాభా లేదా అత్యధిక గిరిజన జనాభా, 3. పొరుగు దేశాలతో సరిహద్దు కలిగిన వ్యూహాత్మక ప్రాంతాలు కలిగిన రాష్ట్రాలు, 4. ఆర్థిక, మౌలిక వసతుల లేమి కలిగిన రాష్ట్రాలు, 5. అత్యల్ప ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు అర్హులను కేంద్రం స్పష్టం చేసింది. 2012లో ఇంటర్ మినిస్ట్రీ రియల్ గ్రూప్ బీహార్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించిందని, అయితే ఎన్డీసీ నిర్దేశించిన ప్రమాణాలలో బీహార్ అర్హత సాధించలేకపోయిందని పేర్కొన్నారు.

Read Also: Health Tips: పాలు, పెరుగు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

 

 

 

 

 

 

 

 

 

 

Follow us